క్రీడాభూమి

నేటి నుంచి విండీస్ బోర్డు ఎలెవన్‌తో టీమిండియా సన్నాహక మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెటెర్రె (సెయింట్ కిట్స్), జూలై 13: వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు చివరి సన్నాహకంగా టీమిండియా గురువారంనుంచి ఇక్కడ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో జరగనున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఎవరనేది దాదాపుగా తేలిపోతుంది. ఈ నెల 21నుంచి ఆంటిగ్వాలో తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీలు అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్ల పెర్ఫార్మెన్స్‌ను బేరీజు వేయనున్నారు. ఇంతకు ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలోను భారత పేస్ బౌలర్లు పెద్దగా రాణించలేకపోయిన నేపథ్యంలో వారు తమ పొరబాట్లు సరిదిద్దుకోవడానికి ఇది చివరి అవకాశం కానుంది. గాయాల కారణంగా సుదీర్ఘకాలం విరామం అనంతరం జట్టులోకి తిరిగి స్థానం పొందాలనుంటున్న భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ మొదట్లో బాగానే రాంచినా ఆ తర్వాత తమ లైన్ అండ్ లెంగ్త్‌పై పట్టుకోల్పోయినట్లు కనిపించారు. ఇక జట్టులో కీలక బౌలర్లయిన ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు కూడా జట్టులో తమ స్థానాన్ని పదిలపర్చుకోవాలంటే చెమటోడ్చాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం ప్రాక్టీస్ మ్యాచ్‌లలో బాగానే రాణించాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు కూడా తమ నైపుణ్యానికి మరింత పదును పెట్టుకోవడానికి ఈ మ్యాచ్ తోడ్పడనుంది. అయితే బ్యాట్సమెన్ విషయంలో మాత్రం అంతగా ఇబ్బందులేమీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, శిఖర్‌ధావన్‌లు దాదాపుగా తమ స్థానాలను పదిలం చేసుకోగా, మురళీ విజయ్ సైతం ఓపెనర్ స్థానం కోసం పోటీలో ఉన్నాడు. చేతేశ్వర్ పూజారి, రోహిత్ శర్మలు కూడా ఇంతకు ముందు జరిగిన వామప్ మ్యాచ్‌లో చక్కగా రాణించారు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలు తక్కువ స్కోరుకే అవుటయినప్పటికీ వారు ఫామ్‌లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదని భావిస్తున్నారు.