క్రీడాభూమి

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన గయానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయానా, జూలై 13: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్‌లో టేబుల్ టాపర్ గయానా అమెజాన్ వారియర్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు రయాద్ ఎమ్రిట్, సొహైల్ తన్వీర్, ఆడమ్ జంపాతో పాటు బ్యాట్స్‌మన్లు కూడా చక్కగా రాణించడంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జౌక్స్ జట్టును మట్టికరిపించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. సిపిఎల్-2016లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన గయానా అమెజాన్ వారియర్స్‌కు ఇది ఐదో విజయం. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడి గయానా విజయంలో ముఖ్యభూమిక పోషించిన జాసన్ మొహమ్మద్ (29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
టాస్ గెలిచిన గయానా జట్టు కెప్టెన్ మార్టిన్ గుప్టిల్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన సెయింట్ లూసియా జట్టు పరుగుల ఖాతా ఆరంభించకుండానే ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (0) వికెట్‌ను, ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ షేన్ వాట్సన్ (4) వికెట్‌ను చేజార్చుకుని ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మైఖేల్ హస్సీ (50 బంతుల్లో 64 పరుగులు) స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అతనికి తోడు వికెట్ కీపర్ ఆండ్రూ ఫ్లెచర్ 16 పరుగులు, డేవిడ్ మిల్లర్ 23 పరుగులు, కెప్టెన్ డారెన్ సమీ 11 పరుగులు సాధించి నిష్క్రమించగా, కైల్ మేయర్స్ (2), గ్రాంట్ ఇలియట్ (5) అజేయంగా నిలిచారు. దీంతో సెయింట్ లూసియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు రాబట్టగలిగింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన గయానా జట్టుకు ఓపెనర్లు డ్వెయిన్ స్మిత్ (24 బంతుల్లో 32), మార్టిన్ గుప్టిల్ (22 బంతుల్లో 19) 55 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు. వీరి నిష్క్రమణ తర్వాత క్రిస్ లిన్ (29 బంతుల్లో 38), జాసన్ మొహమ్మద్ (29 బంతుల్లో 43) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 17.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించిన గయానా జట్టు 16 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జౌక్స్‌పై విజయం సాధించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
సెయింట్ లూసియా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 138/6 (మైఖేల్ హస్సీ 64, డేవిడ్ మిల్లర్ 23, ఆండ్రూ ఫ్లెచర్ 16, డారెన్ సమీ 11, రయాద్ ఎమ్రిట్ 2/25, ఆడమ్ జంపా 2/30, సొహైల్ తన్వీర్ 2/31). వికెట్ల పతనం: 1-0, 2-4, 3-41, 4-103, 5-129, 6-129.
గయానా ఇన్నింగ్స్: 17.2 ఓవర్లలో 139/2 (జాసన్ మొహమ్మద్ 43-నాటౌట్, క్రిస్ లిన్ 38-నాటౌట్, డ్వెయిన్ స్మిత్ 32, మార్టిన్ గుప్టిల్ 19, షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ 1/28, డెరోన్ డేవిస్ 1/31). వికెట్ల పతనం: 1-55, 2-57.