క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ఒలింపిక్ బృందంలో సెమెన్యాకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జూలై 15: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా క్రీడా బృందంలో వివాదాస్పద అథ్లెట్ కాస్టర్ సెమెన్యాకు స్థానం లభించింది. మొత్తం 137 మంది సభ్యులతో కూడిన దక్షిణాఫ్రికా ఒలింపిక్ బృందంలో సెమెన్యాతో పాటు వేడ్ వాన్ నీకెర్క్‌కు కూడా చోటు కల్పించారు. ఈ ఏడాది 800 మీటర్ల రేస్‌ను అత్యంత వేగవంతంగా 1:56:64 నిమిషాల్లో పూర్తిచేసిన సెమెన్యా రియోలో తొలిసారి ఒలింపిక్ పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని క్రీడా పండితులు స్పష్టం చేస్తున్నారు. 2009లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల రేస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సెమెన్యా ఆ తర్వాత వివాదంలో చిక్కుకోవడంతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని మహిళగా పోటీల్లో పాల్గొనేందుకు ధ్రువీకరణ పొందిన విషయం తెలిసిందే. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న సెమెన్యా ఈ ఏడాది పలుసార్లు గాయాలపాలై ఇబ్బందులు పడినప్పటికీ సకాలంలో ఫామ్‌ను అందిపుచ్చుకుంది. కాగా, పురుషుల 400 మీటర్ల రేస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వాన్ నీకెర్క్ కూడా రియో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పసిడి పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదిలావుంటే, రియో ఒలింపిక్స్‌లో పతకాలను సాధించి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసే క్రీడాకారులకు భారీ మొత్తంలో నగదు బహుమతులను అందజేస్తామని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది. పసిడి పతకాలు సాధించిన క్రీడాకారులకు 5 లక్షల ర్యాండ్‌లు (35 వేల డాలర్లు లేదా 32 వేల యూరోలు), రజత పతకాలను సాధించిన వారికి 2.5 లక్షల ర్యాండ్‌లు, కాంస్య పతకాలు గెలుచుకున్న వారికి లక్ష ర్యాండ్‌ల చొప్పున అందజేస్తామని జాకబ్ జుమా ప్రభుత్వం ప్రకటించింది.