క్రీడాభూమి

విశాఖలో టెస్టు క్రికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా నవంబర్ 9వ తేదీ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో రాజ్‌కోట్, విశాఖపట్నం తొలిసారి టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్ జట్టు టీమిండియాతో మొత్తం ఐదు టెస్టులు, మూడు అంతర్జాతీయ వనే్డలు, మరో మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లలో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లు జరిగే తేదీలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో నవంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు జరిగే తొలి మ్యాచ్‌కు రాజ్‌కోట్ ఆతిథ్యమివ్వనుండగా, నవంబర్ 17 నుంచి 21వ తేదీ వరకు విశాఖలో రెండో టెస్టును నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు మొహాలీలో మూడో టెస్టు, డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ముంబయిలో నాలుగో టెస్టు, డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు చెన్నైలో చివరి టెస్టు జరుగుతాయి. అయితే వీటిలో డే/నైట్ టెస్టు మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. ఈ మ్యాచ్‌లన్నీ ఉదయం 9.30 గంటలకు మొదలవుతాయని బిసిసిఐ తన వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.
టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తలపడటానికి ముందు ఇంగ్లాండ్ జట్టు క్రిస్మస్ పండుగను జరుపుకునేందుకు స్వదేశానికి తిరిగివెళ్తుందని భావిస్తున్నారు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 15వ తేదీన పుణేలో జరిగే పోరుతో డే/నైట్ వనే్డ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి 19వ తేదీన కటక్‌లో రెండో వనే్డ మ్యాచ్‌ను, జనవరి 22వ తేదీన కోల్‌కతాలో చివరి వనే్డ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఈ మూడు వనే్డలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మొదలవుతాయి. వనే్డ సిరీస్ ముగిసిన తర్వాత ఈ రెండు జట్లు కాన్పూర్ (జనవరి 26వ తేదీన), నాగ్‌పూర్ (జనవరి 29), బెంగళూరు (్ఫబ్రవరి 1)లలో మూడు అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌లలో తలపడతాయి. ఈ మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.