క్రీడాభూమి

సింగిల్స్‌లో బొపన్న గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 17: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇప్పటికే వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ దశకు దూసుకెళ్లిన భారత్ మరో విజయాన్ని సాధించింది. ఆసియా/ఓషియానియా గ్రూప్-1లో ఆదివారం ఇక్కడ జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో భారత్ ఈ విజయాన్ని అందుకుంది. కెరీర్‌లో సింగిల్స్ మ్యాచ్‌లు పెద్దగా ఆడని రోహన్ బొపన్న ఆదివారం దక్షిణ కొరియా ఆటగాడు హాంగ్ చుంగ్‌ను ఓడించి భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత జరిగిన మరో రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్‌పై కొరియా ఆటగాడు యంగ్ క్యు లిమ్ చెమటోడ్చి విజయం సాధించాడు. దీంతో కొరియా జట్టు ‘వైట్‌వాష్’ గండం నుంచి బయటపడింది. శుక్రవారం సుదీర్ఘంగా సాగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో విజయం సాధించి అలసిపోయిన సాకేత్ మైనేని ఇంకా ఆ అలసట నుంచి బయటపడలేదు. దీంతో అతనికి బదులుగా బొపన్న ఆదివారం రివర్స్ సింగిల్స్ బరిలోకి దిగాడు. ఆసియా/ఓషియానియా గ్రూప్-1లో భారత్ ఇప్పటికే 3-0 తేడాతో కొరియాను ఓడించడంతో రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ప్రాధాన్యత కోల్పోయాయి. అయినప్పటికీ బొపన్న తీవ్రస్థాయిలో శ్రమించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎంతో దిగువన (655వ స్థానంలో) కొనసాగుతున్న చుంగ్‌పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఇంతకుముందు 2012లో చివరిసారి సింగిల్స్ మ్యాచ్ ఆడిన బొపన్న డేవిస్ కప్ సింగిల్స్‌లో విజయం సాధించడం ఇది పదోసారి. దీంతో ప్రస్తుతం భారత్ ఆధిక్యత 4-0కు పెరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో కొరియా ఆటగాడు యంగ్ క్యు లిమ్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 409వ స్థానం) ర్యాంకింగ్స్‌లో తన కంటే ఎంతో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న రామ్‌కుమార్ రామనాథన్ (217వ ర్యాంకు)పై అనూహ్య విజయం సాధించాడు. సుమారు 2 గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో లిమ్ 6-3, 4-6, 7-6 తేడాతో రామ్‌కుమార్‌ను ఓడించి కొరియాకు కంటి తుడుపు విజయాన్ని అందించడంతో పాటు వైట్‌వాష్ గండం నుంచి తమ జట్టును గట్టెక్కించాడు.