క్రీడాభూమి

విజృంభించిన పూరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిడ్జిటౌన్ (బార్బడోస్), జూలై 18: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ సత్తా చాటుకున్నాడు. బ్రిడ్జిటౌన్‌లోని కింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో ఆదివారం సెయింట్ లూసియా జౌక్స్ జట్టుతో జరిగిన పోరులో అతను బ్యాట్ ఝళిపించి కేవలం 39 బంతుల్లో 81 (4 సిక్సర్లు, 9 ఫోర్లు సహా) పరుగులు సాధించాడు. అతనికి తోడు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు కైల్ హోప్ (28), షోయబ్ మాలిక్ (15), ఎబి.డివిలియర్స్ (32) తమ వంతు రాణించడంతో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన సెయింట్ లూసియా జౌక్స్ జట్టులో సీనియర్లు ఎవరూ తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. వికెట్ కీపర్ ఫ్లెచర్ 20 పరుగులు, మైఖేల్ హస్సీ 17, డేవిడ్ మిల్లర్ 11, కెప్టెన్ డారెన్ సమీ 18, మేయర్స్ 18 పరుగులు సాధించి నిష్క్రమించగా, షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ (13), జెరోమ్ టేలర్ (17) అజేయంగా నిలిచారు. దీంతో 8 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే రాబట్టిన సెయింట్ లూసియా జౌక్స్ జట్టు 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

చిత్రం.. 39 బంతుల్లో 81 పరుగులు సాధించిన నికోలస్ పూరన్