క్రీడాభూమి

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో యాసిర్‌కు అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూలై 18: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా ప్రకటించిన ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శనివారం లార్డ్స్ మైదానంలో ముగిసిన తొలి టెస్టులో యాసిర్ షా అద్భుత ప్రదర్శనతో 141 పరుగులకు 10 వికెట్లు కైవసం చేసుకుని పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం విదితమే. దీంతో అతను ఇప్పటివరకూ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంగ్లాడ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను కిందికి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. ప్రపంచ ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో పాక్ ఆటగాడు అగ్రస్థానానికి చేరుకోవడం రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఇంతకుముందు పాక్ బౌలర్ ముస్తాక్ అహ్మద్ 1996 డిసెంబర్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. కాగా, 2005లో ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వార్న్ ప్రపంచ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తర్వాత ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న తొలి లెగ్ స్పిన్నర్‌గా యాసిర్ షా రికార్డులకు ఎక్కాడు.

చిత్రం.. లార్డ్స్ మైదానంలో దుమ్మురేపిన యాసిర్ షా