క్రీడాభూమి

ఒలింపిక్ పతకం సాధించడంపై జోస్యం చెప్పలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: బ్రెజిల్‌లోని రియోడీజెనిరోలో వచ్చే నెల జరిగే ఒలింపిక్స్‌లో సత్తా చాటుకునేందుకు హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సమాయత్తమవుతోంది. అయితే రియోలో పతకాన్ని సాధించగలుగుతానా? లేదా? అనే దానిపై జోస్యం చెప్పేందుకు ఆమె నిరాకరించింది. రియో ఒలింపిక్ టెన్నిస్ ఈవెంట్‌లో సానియా మీర్జా యువ క్రీడాకారిణి ప్రార్థనా తోంబ్రేతో కలసి మహిళల డబుల్స్ విభాగంలోనూ, రోహన్ బొపన్నతో కలసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ బరిలోకి దిగనుంది. ఇంతకుముందు ప్రతి పెద్ద టోర్నమెంట్‌కు సిద్ధమైనట్లుగానే ఒలింపిక్స్‌కు కూడా తీవ్రస్థాయిలో సన్నద్ధమవుతున్నానని ఆమె తెలిపింది. ‘టోర్నమెంట్ ఏదైనా ప్రతి మ్యాచ్‌లో మనం శక్తివంచన లేకుండా ఆడి గెలిచేందుకు ప్రయత్నించాల్సిందే. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించగలనని ఆశిస్తున్నా. ఒకవేళ పతకాన్ని గెలుచుకోలేకపోతే మళ్లీ ప్రయత్నిస్తా. అంతేతప్ప జరగబోయేది ఏమిటన్న దానిపై జోస్యం చెప్పలేను’ అని సానియా పిటిఐ వార్తా సంస్థకు స్పష్టం చేసింది. బోపన్నతో కలసి ఆడటం ఎలా ఉందన్న ప్రశ్నకు సానియా బదులిస్తూ, తమ మధ్య చక్కటి సమన్వయం ఉందని చెప్పింది. ‘బొపన్నతో నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది. మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. మేమిద్దరం చాలా మ్యాచ్‌లలో కలసి ఆడాం. ఇప్పుడు రియో ఒలింపిక్స్‌లో కూడా కలసి ఆడేందుకు ఎదురుచూస్తున్నాం’ అని సానియా పేర్కొంది. ఒలింపిక్స్‌లో తాము విజయం సాధించాలంటే ఒకరికొకరు స్ఫూర్తిగా ఉండాలని, అయితే దేశం తరఫున ఆడటమే తమకు అతిపెద్ద స్ఫూర్తి అని ఆమె పేర్కొంది.