క్రీడాభూమి

‘సుప్రీం’ తీర్పును గౌరవిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను సంస్కరించే విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బిసిసిఐ గౌరవిస్తుందని, ఇందుకు సంబంధించి జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను అమలుపరిచేందుకు బిసిసిఐ కృషి చేస్తుందని ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్ రాజీవ్ శుక్లా సోమవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ‘బిసిసిఐలో సంస్కరణల విషయమై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాం. ఇందుకు సంబంధించి జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను ఎంతమేరకు అమలు చేయగలుగుతామన్న విషయాన్ని పరిశీలిస్తాం’ అని శుక్లా పేర్కొన్నాడు. మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 70 ఏళ్ల వయసు నిండిన వ్యక్తులు బిసిసిఐలో సభ్యత్వం పొందకుండా నిరోధించాలని, అలాగే బిసిసిఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని జస్టిస్ లోధా కమిటీ చేసిన పలు ప్రధాన సిఫారసులకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పును మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, కీర్తి ఆజాద్ కూడా స్వాగతించారు. ‘వ్యక్తుల కంటే వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది. దేశంలో క్రికెట్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనమంతా గౌరవించి తీరాలి’ అని బిషన్ సింగ్ బేడీ ట్వీట్ చేశాడు. కాగా, లోధా కమిటీ నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఈ వ్యవహారంలో డిడిసిఎ (్ఢల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)తో పాటు బిసిసిఐపై సుప్రీం కోర్టు చేపట్టే తదుపరి చర్యల కోసం ఎదురుచూస్తున్నానని కీర్తి ఆజాద్ ట్వీట్ చేశాడు. డిడిసిఎలో అవినీతి, అక్రమాలపై బిషన్ సింగ్ బేడీ, కీర్తి ఆజాద్ కలసికట్టుగా పోరాడుతున్న విషయం తెలిసిందే.
విశిష్టమైన తీర్పు : జస్టిస్ ముద్గల్
ఇదిలావుంటే, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఐపిఎల్ స్పాట్-్ఫక్సింగ్ కుంభకోణంపై 2013లో సుప్రీం కోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించిన కమిటీకి జస్టిస్ ముద్గల్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఎంతో విశిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పుతో బిసిసిఐ పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.