క్రీడాభూమి

యాసిర్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 27: డోపింగ్ పరీక్షలో దోషిగా తేలిన పాకిస్తాన్ బౌలర్ యాసిర్ షా. ఈఏడాది నవంబర్ 13న జరిగిన డోప్ టెస్టులో అతను నిషిద్ధ ద్రవ్యాలను వినియోగించినట్టు రుజవైందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. టెస్టు క్రికెట్ నుంచి అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించిన తర్వాత అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) సమర్పించే నివేదికను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇలావుంటే, యాసిర్‌పై వేటు పడడంతో, రానున్న తమ టూర్ల ఇబ్బందులు తప్పవని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో వాపోయంది. యాసిర్ డోపింగ్‌కు పాల్పడలేదని, ‘బి’ శాంపిల్‌లో ఈ విషయం స్పష్టమవుతుందన్న నమ్మకం తమకు ఉందని పేర్కొంది.