క్రీడాభూమి

తొలి రోజే డజను వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 25: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరో లోస్కోరింగ్ మ్యాచ్ తప్పదని స్పష్టమవుతున్నది. బుధవారం మూడో టెస్టు ఆరంభంకాగా, మొదటి రోజునే 12 వికెట్లు కూలాయి. భారత్ 215 పరుగులకు ఆలౌటైతే, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి కేవలం పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పిచ్‌పై బంతి అనూహ్యంగా దిశను మార్చుకుంటుందని, ఫలితంగా బౌలర్లకు ఇది అనుకూలిస్తుందని అర్థమవుతోంది. ఈ కారణంగానే భారీగా స్కోర్లు చేయడం బ్యాట్స్‌మెన్‌కు అసాధ్యంగా మారుతుందని పరిశీలకుల అభిప్రాయం. సిమోన్ హార్మర్ నాలుగు, మోర్న్ మోర్కెల్ మూడు వికెట్లు పడగొట్టి, బలమైన బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయడమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 పరుగుల స్కోరు వద్ద మొదటి వికెట్‌ను శిఖర్ ధావన్ రూపంలో కోల్పోయింది. అతను 23 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి డీన్ ఎల్గార్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన మరో ఓపెనర్ మురళీ విజయ్ 40 పరుగులు చేసి మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. 84 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. స్టార్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా (21), కెప్టెన్ విరాట్ కోహ్లీ (22), ఆజింక్య రహానే (13), రోహిత్ శర్మ (2) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరిలో వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా కొంత సేపు దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు ఎదురునిలిచి టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు. జడేజా 54 బంతుల్లో 34, సాహా 106 బంతుల్లో 32 చొప్పున పరుగులు సాధించి వెనుదిరిగారు. రవిచంద్రన్ అశ్విన్ 15 పరుగులు చేసి ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, అమిత్ మిశ్రా (3)ను హార్మర్ ఎల్‌బిగా పెవిలియన్‌కు పంపాడు. 78.2 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్‌కు 215 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి ఒక్క బంతిని కూడా ఎదుర్కొనే అవకాశం రాని ఇశాంత్ శర్మ నాటౌట్‌గా ఉన్నాడు.
అశ్విన్ తొలి దెబ్బ
టీమిండియాను మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం దక్షిణాఫ్రికా జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. మొదటి ఇన్నింగ్స్‌ను ఆడేందుకు మైదానంలోకి దిగిన ఆ జట్టును స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి దెబ్బతీశాడు. ఏడు బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతాను తెరవకుండానే అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వాన్ జిల్ వెనుదిరిగాడు. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఇమ్రాన్ తాహిర్ (4)ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో రెండు వికెట్లకు 11 పరుగులు చేసింది. డీన్ ఎల్గార్ (7), కెప్టెన్ హషీం ఆమ్లా (0) క్రీజ్‌లో ఉన్నారు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ ఎల్‌బి మోర్న్ మోర్కెల్ 40, శిఖర్ ధావన్ సి అండ్ బి ఎల్గార్ 12, చటేశ్వర్ పుజారా ఎల్‌బి హార్మర్ 21, విరాట్ కోహ్లీ సి విలాస్ బి మోర్న్ మోర్కెల్ 22, ఆజింక్య రహానే బి మోర్న్ మోర్కెల్ 13, రోహిత్ శర్మ సి డివిలియర్స్ బి హార్మర్ 2, వృద్ధిమాన్ సాహా సి డుమినీ బి హర్మర్ 32, రవీంద్ర జడేజా బి కాగిసో రబద 34, అశ్విన్ బి ఇమ్రాన్ తాహిర్ 15, అమిత్ మిశ్రా ఎల్‌బి హార్మర్ 3, ఇశాంత్ శర్మ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 21, మొత్తం (78.2 ఓవర్లలో ఆలౌట్) 215.
వికెట్ల పతనం: 1-50, 2-69, 3-94, 4-115, 5-116, 6-125, 7-173, 8-201, 9-215, 10-215.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 16.1-7-35-3, కాగిసో రబద 17-8-30-1, సిమోన్ హార్మర్ 27.2-2-78-4, డీన్ ఎల్గార్ 4-0-7-1, ఇమ్రాన్ తాహిర్ 12.5-1-41-1, జెపి డుమినీ 1-0-6-0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గార్ నాటౌట్ 7, వాన్ జిల్ సి రహానే బి అశ్విన్ 0, ఇమ్రాన్ తాహిర్ బి జడేజా 4, హషీం ఆమ్లా నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (9 ఓవర్లలో 2 వికెట్లకు) 11.
వికెట్ల పతనం: 1-4, 2-9.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 2-1-4-0, అశ్విన్ 4-2-5-1, జడేజా 3-1-2-1.