క్రీడాభూమి

మహిళా హాకీ జట్టుకు మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనె్హయిమ్ (అమెరికా), జూలై 23: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తుది సన్నాహాలు చేసుకుంటున్న భారత మహిళా హాకీ జట్టు అమెరికా పర్యటనలో మరో విజయంతో సత్తా చాటుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో 5-2 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించి ఈ పర్యటనలో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. వందనా కటారియా, దీపిక చెరో రెండు గోల్స్‌తో రాణించి భారత జట్టును విజయపథంలో నడిపారు. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించి ఆడిన భారత జట్టుకు తొలి 15 నిమిషాల్లోపే ఒక పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ దానిని గోల్‌గా మలచలేకపోయింది. అయితే 9వ నిమిషంలో వందనా కటారియా అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించి భారత్‌కు శుభారంభాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లకు చెరో పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ అవి గోల్స్‌గా రూపాంతరం చెందలేదు. అయితే 17వ నిమిషంలో కెనడా క్రీడాకారిణి స్టెపానీ నోర్లాండర్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో మ్యాచ్ ప్రథమార్థం ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సరిసమానంగా నిలిచాయి. ద్వితీయార్థం మొదలైన తర్వాత ఇరు జట్లు కొద్దిసేపు హోరా హోరీగా తలపడగా, 38వ నిమిషంలో దీపిక సాధించిన ఫీల్డ్ గోల్‌తో భారత్ పైచేయి సాధించింది. కానీ ఈ సంతోషం నాలుగు నిమిషాల పాటు కూడా నిలవలేదు. 42వ నిమిషంలో బ్రియెన్నీ స్టెయిర్స్ కెనడాకు ఈక్విలైజర్‌ను అందించడంతో మళ్లీ ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో చివరి 15 నిమిషాల్లో రెచ్చిపోయి ఆడిన భారత జట్టుకు 49వ నిమిషంలో దీపిక రెండో గోల్‌ను అందించగా, రెండు నిమిషాల తర్వాత వందనా కటారియా కూడా మరో గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యత రెట్టింపైంది. దీంతో తీవ్ర వత్తిడికి లోనైన కెనడా చివర్లో గోల్స్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయితే వాటిని సమర్ధవంతంగా ప్రతిఘటించిన భారత జట్టుకు 58వ నిమిషంలో పూనమ్ మరో గోల్‌ను అందించింది. దీంతో 5-2 గోల్స్ తేడాతో కెనడాను మట్టికరిపించిన భారత జట్టు ఈ పర్యటనలో వరుసగా రెండో విజయంతో సత్తా చాటుకుంది.