క్రీడాభూమి

అశ్విన్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 24: టీమిండియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు భారీ ఓటమి దిశగా పయనిస్తోంది. భారత పేస్ బౌలర్లు ఉమేష్ యాదవ్ (4/41), మహమ్మద్ షమీ (4/66) ధాటికి తట్టుకోలేక తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే కుదేలై ఫాలోఆన్‌లో పడిన కరీబియన్లు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టపోయి 21 పరుగులు సాధించారు. ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టు అదే స్కోరు వద్ద మరో వికెట్ కోల్పోయింది. నైట్ వాచ్‌మన్ డ్వెయిన్ బ్రావో (10) ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అజింక్యా రహానేకి దొరికిపోయాడు. అనంతరం రాజేంద్ర చంద్రిక (31), మర్లాన్ శామ్యూల్స్ (50) కొద్దిసేపు స్థిమితంగా ఆడి మూడో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభించి వీరిద్దరితో పాటు జెర్మయిన్ బ్లాక్‌వుడ్ (0), రోస్టన్ చేస్ (8)లను త్వరత్వరగా పెవిలియన్‌కు చేర్చగా, కడపటి వార్తలు అందే సమయానికి వికెట్ కీపర్ షేన్ డౌరిచ్ (1) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు నష్టపోయి 106 పరుగులు సాధించిన వెస్టిండీస్ జట్టు ఇంకా ఇన్నింగ్స్

217 పరుగులు వెనుకబడి ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది.