క్రీడాభూమి

అక్కడ అన్నీ భారీ ఏర్పాట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జనిరో,జూలై 24: రియో ఒలింపిక్స్ మరో 15 రోజుల్లో ప్రారంభమవుతుండగా ఆదివారం అథ్లెటిక్ విలేజ్ అధికారికంగా ప్రారంభమయింది. దీంతో ఒలింపిక్సలో పాల్గొనే 10 వేలకు పైగా అథ్లెట్లు, మరో 7 వేల మంది అధికారులు ఈ విలేజ్‌లోకి ప్రవేశించడం మొదలవుతుంది. వచ్చే నెల 5న గేమ్స్ ప్రారంభమయ్యే దాకా అథ్లెట్ల రాకడ కొనసాగుతూనే ఉంటుంది. కాగా, 31 భవనాలతో ఏర్పాటయిన ఈ ఒలింపిక్స్ విలేజ్ ప్రపంచంలోని అత్యుత్తమ సదుపాయాలన్నిటినీ కలిగి ఉంటుంది. టెన్నిస్ కోర్టులు.. సాకర్ మైదానాలు.. ఏడు స్విమ్మింగ్ పూల్స్‌తో పాటుగా దాదాపు మూడు ఫుట్‌బాల్ మైదానాలంత విశాలమైన డైనింగ్- కిచెన్ కాంపౌండ్ కూడా ఇందులో ఉంది. ఇప్పటికే శనివారం కొన్ని దేశాల ప్రతినిధులు ఈ గ్రామంలోకి ప్రవేశించారు కూడా. అక్కడక్కడా రెపరెపలాడుతున్న ఆయా దేశాల పతాకాలే దీనికి నిదర్శనం. స్లోవేనియా, డెన్మార్క్, కెనడా, బ్రిటన్, పోర్చుగల్, ఫిన్లాండ్, స్వీడన్‌లాంటి దేశాలు ఇలా వచ్చిన వాటిలో ఉన్నాయి.
ఈక్రీడా గ్రామంలో ప్రతి ఒక్కటీ భారీ ప్రమాణంలోనే ఉన్నాయి. 10,100 గదులు, 18 వేల బెడ్స్, ఏడు లాండ్రీలు, భారీ ఆస్పత్రి సైజు క్లినిక్, భారీ జిమ్ ఇందులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇవి కాకుండా అథ్లెట్లకు 4,50,000 కండోమ్స్‌లను కూడా నిర్వాహకలు సరఫరా చేస్తున్నారు. వీటిలో లక్ష స్ర్తిలు ఉపయోగించే కండోమ్‌లున్నాయి. లండన్ ఒలింపిక్స్‌లో సరఫరా చేసిన కండోమ్స్‌కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రెజిల్‌లో జికా వైరస్ ప్రబలిన నేపథ్యంలో సురక్షితమైన సెక్స్‌ను ప్రోత్సహించడం కోసం సరఫరాలను పెంచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే డైనింగ్-కిచెన్ ప్రాంతం ప్రత్యేకత మరో ఎత్తు. సువిశావలమైన ఈ కిచెన్‌లో ప్రతి రోజూ 60 వేల భోజనాలు అథ్లెట్ల కోసం సర్వ్ చేస్తారు. ఇవిగాక మరో వెయ్యి మంది సహాయకులు కూడా ఇక్కడే భోజనాలు చేస్తారు. అయితే ఎంత తయారు చేయాలనేదే పెద్ద సమస్య అని రియో ఒలింపిక్స్‌లో ఫుడ్, బెవరేజ్ సేవలను పర్యవేక్షించే ఫ్లావియా అల్బూకర్క్ అంటున్నారు. అయినప్పటికీ అందరినీ సంతృప్తి పరిచే విధంగా వంటకాలు ఉండేలా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇక వేల సంఖ్యలో చేరే తిని పడేసే ప్లేట్లను కడగాల్సిన అవసరం ఉండదు. మొక్కజొన్న, చెరకు పిప్పితో తయారు చేసే ఈ ప్లేట్లు సులభంగా మట్టిలో కలిసిపోతాయి.

రియోలో కొలువుదీరిన ఒలింపిక్ క్రీడా గ్రామం ఇదే