క్రీడాభూమి

ఆధారాల్లేకుండా ఆరోపణలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: రియో ఒలింపిక్స్‌కు వెళ్లాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడానికి తాము కుట్ర పన్నినట్లు వస్తున్న ఆరోపణలను ప్రముఖ రెజ్లింగ్ కోచ్ సత్పాల్ సింగ్ మంగళవారం తోసిపుచ్చాడు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, ఎటువంటి ఆధారాల్లేకుండా తనవైపు, తన అల్లుడి వైపు వేలెత్తి చూపడం సరికాదని ఆయన పేర్కొన్నాడు. ‘నర్సింగ్ విషయంలో నేను, నా బృందం కుట్రకు పాల్పడినట్లు చూపేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. కానీ దీంతో మాకేమీ సంబంధం లేదు. ఈ విషయంలో ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి. అంతే తప్ప ఎటవంటి ఆధారాలు లేకుండా మాపై ఆరోపణలు చేయవద్దు’ అని సత్పాల్ సింగ్ ఒక వార్తా సంస్థతో అన్నాడు. దేశంలోని ప్రఖ్యాత రెజ్లింగ్ కోచ్‌లలో ఒకడిగా పేరు పొందిన సత్పాల్ సింగ్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మామ.
డోపింగ్ పరీక్షలో నర్సింగ్ యాదవ్ విఫలమవడంతో అందుకు తామే కారణమంటూ తనతో పాటు సుశీల్ కుమార్ పేరు తెర మీదికి వచ్చాయని, వాస్తవానికి డోపింగ్ పరీక్షలో నర్సింగ్ విఫలమయ్యాడన్న వార్త విని ఎంతో విచారించానని, ఒలింపిక్స్‌లో దేశానికి పతకం రావాలని ఆశించడమే ఇందుకు కారణమని సత్పాల్ సింగ్ చెప్పాడు. అయినా క్రీడాకారులు ఏమి తింటున్నారో చూసుకోవాల్సిన బాధ్యత కోచ్‌లు, క్రీడా సమాఖ్యలదేనని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇది కుట్ర అని ఎలా ఆరోపిస్తారని ఆయన ప్రశ్నించాడు.
గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కైవసం చేసుకున్న సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి వివాదాస్పద రీతిలో రియో బెర్తును దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే నర్సింగ్ పట్ల తమకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష లేదని, రియో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించాల్సిన ఉత్తమ రెజ్లర్ ఎవరనే విషయాన్ని నిర్ణయించాల్సిందిగా కోరేందుకే కోర్టును ఆశ్రయించామని సత్పాల్ సింగ్ చెప్పాడు. అయితే కోర్టు తీర్పు నర్సింగ్‌కు అనుకూలంగా రావడంతో సుశీల్ కుమార్ అధ్యాయం ముగిసిందని, ఒలింపిక్స్‌లో భారత్‌కు ఉత్తమ రెజ్లర్ ప్రాతినిథ్యం వహించి పతకాన్ని తీసుకురావాలని ఆశించినందునే తాము ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టుకు వెళ్లలేదని సత్పాల్ సింగ్ స్పష్టం చేశాడు.

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన
అల్లుడు సుశీల్ కుమార్‌తో సత్పాల్ సింగ్ (ఫైల్ ఫొటో)