క్రీడాభూమి

లోధా కమిటీ నిర్ణయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో దోషులుగా తేరిన వారిపై ఆర్‌ఎం లోధా కమిటీ నిర్ణయాలు తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేసి సంవత్సరాల సస్పెన్షన్‌ను విధించింది. ఈ కేసులో వారివారి పాత్ర స్పష్టం కావడంతో, చెన్నై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలను జీవితకాలం సస్పెండ్ చేసింది. సుప్రీం కోర్టు సూచనల మేరకు లోధా కమిటీ భవిష్యత్తులో అనుసరించాల్సిన విధివిధానాలపై బిసిసిఐకి మార్గదర్శకం చేసింది. ఈ కమిటీ సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేయాలని బిసిసిఐ కార్యవర్గం తీర్మానించడం విశేషం. ఇలావుంటే, రెండేళ్లు సస్పెన్షన్‌కు గురైన చెన్నై, రాజస్థాన్ జట్ల స్థానాల్లో తాత్కాలిక జట్లుగా పుణె, రాజ్‌కోట్ అడుగుపెట్టబోతున్నాయి. వచ్చే రెండేళ్లు ఈ రెండు జట్లు ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడతాయి. కొత్త ఫ్రాంచైజీలకు రివర్స్ బిడ్స్‌ను ఆహ్వానించగా తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ రైజింగ్ సంస్థ పుణె ఫ్రాంచైజీని, ఇంటెక్స్ మొబైల్స్ సంస్థ పుణెను సొంతం చేసుకున్నాయ.