క్రీడాభూమి

ప్రో కబడ్డీ సెమీస్‌లో టైటాన్స్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఫేవరిట్ తెలుగు టైటాన్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. కాగా, పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. శుక్రవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో పాట్నా పైరేట్స్ 37-33 పాయింట్ల తేడాతో పుణెరీ పల్టన్‌ను ఓడించింది. ప్రదీప్ నర్వాల్ 10 పాయింట్లతో రాణించగా, రాజేష్ మోండల్ ఆరు పాయింట్లు చేశారు. కుల్దీప్ సింగ్, సర్జీత్ సింగ్ చెరి ఐదేసి పాయింట్లు తమతమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. పుణెరీ పల్టన్ తరఫున దీప్‌క్ నివాస్ హూడా తొమ్మిది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మన్జీత్ చిల్లార్ ఏడు పాయింట్లు సాధించాడు. పుణెరీ పల్టన్ చివరి వరకూ విజయం కోసం తీవ్ర స్థాయిలో పోరాడగా, పాట్నా పైరేట్స్ అతి కష్టం మీద నాలుగు పాయింట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఎంతో ఆసక్తిని రేపుతుందనుకున్న రెండో సెమీ ఫైనల్‌లో స్థానిక జట్టు తెలుగు టైటాన్స్ పేలవమైన ఆటతో అభిమానులను నిరాశ పరచింది. జైపూర్ 34 పాయింట్లు సాధించగా, బలమైన జట్టుగా ప్రశంసలు పొందిన తెలుగు టైటాన్స్ 24 పాయింట్లకు పరిమితమై, ఏకంగా పది పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ జట్టులో రాహుల్ చౌదరీ (8 పాయింట్లు), నీలేష్ సాలంకే (6 పాయింట్లు) తప్ప ఎవరూ రాణించలేదు. జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ జస్వీర్ సింగ్ 8 పాయింట్లు సాధించాడు. అతనికే బెస్ట్ రైడర్ అవార్డు లభించింది. కాగా, అజయ్ కుమార్ 6 పాయింట్లు చేశాడు.
ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు ఢీ కొంటాయి. మూడో స్థానానికి తెలుగు టైటాన్స్, పుణెరీ పల్టన్ జట్లు పోటీపడతాయి.

తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓ దృశ్యం