క్రీడాభూమి

అసౌకర్యానికి క్షమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, జూలై 29: అనుకున్న సమయంలో పనులు పూర్తికాకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయని రియో డి జెనీరో మేయర్ ఎడ్యుయార్డో పేస్ అంగీకరించాడు. అసౌకర్యానికి క్షమించాలని వివిధ దేశాల నుంచి ఇప్పటికే ఒలింపిక్ క్రీడాగ్రామానికి చేరుకున్న అథ్లెట్లకు విజ్ఞప్తి చేశాడు. ఆర్థిక మాంద్యం, రాజకీయ అనిశ్చితి వంటి పలు కారణాలతో రియో ఒలింపిక్స్ కేంద్రాల్లో చేపట్టిన పలు పనుల్లో జాప్యం జరుగుతోంది. చాలా వరకు ముగింపు దశకు చేరుకోగా, వేలాది మంది కార్మికులు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. అయితే, ఇప్పటికే పలు దేశాల నుంచి అథ్లెట్లు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. రోజూ వందల సంఖ్యలో అథ్లెట్లు, అధికారులు రావడంతో, మేయర్ పేస్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నాడు. రియోలో పెల్లుబుకుతున్న నిరసనలు, పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అతను భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ అథ్లెట్లు, అధికారులు ఎదుర్కొంటున్న అసౌకర్యాల గురించి తనకు తెలుసునని అన్నాడు. అందరూ తమకు సహకరించాలని కోరాడు. సాధ్యమైనంత త్వరలో పనులను పూర్తి చేసి, అన్ని వసతులను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చాడు. కొన్ని చోట్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని, వౌలిక సౌకర్యాలు కూడా లేని కారణంగా క్రీడా గ్రామానికి చేరుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు. ఒకటిరెండు రోజుల్లో సమస్యలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
జికా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేస్ అన్నాడు. క్రీడా గ్రామంలో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌సహా ఎంతో మంది జికా వైరస్ గురించి భయపడుతున్నారన్న వార్తలను అతను ఈ సందర్భంగా ప్రస్తావించాడు. బ్రెజిల్‌లో జికా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదంటూ వచ్చిన వార్తలను అతను తోసిపుచ్చాడు. ఇది పొరపాటని, వైరస్‌ను సమర్థంగా అదుపుచేయగలిగామని అన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా జికా వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానాన్ని ఆక్రమించిందని స్పష్టం కావడం మరింత భయాన్ని రేపుతున్నది. అందుకే బ్రెజిల్‌లో జరిగే ఒలింపిక్స్‌కు వెళ్లడానికి చాలా మంది వెనుకాడుతున్నారు. ఇదే విషయాన్ని పేస్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఒలింపిక్స్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి తాము భరోసా ఇస్తున్నామని అన్నాడు. అదే విధంగా జికా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. నంబర్ వన్ గోల్ఫర్ జాసన్ డే, ఆడం స్కాట్, లూయిస్ ఊస్టుజెన్, చార్ల్ షావార్ట్‌జెల్, గ్రేమ్ మెక్‌డొవెల్, విజయ్ సింగ్, రొరీ మెకెల్‌రోయ్ తదితరులు తాము రియో ఒలింపిక్స్‌కు హాజరుకావడం లేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అమెరికా సైక్లిస్టు టెజయ్ వాన్ గార్డెరెన్, బాస్కెట్‌బాల్ స్టార్ స్టెఫెన్ కర్రీ కూడా జికా వైరస్ భయం కారణంగానే వైదొలిగారు. ఈ జాబితా మరింత పెరకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేస్ తెలిపాడు.