క్రీడాభూమి

వణుకుతున్న అధికారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, జూలై 29: రియోలో వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వివిధ శాఖల ఉద్యోగులు, చివరికి పోలీసులు నిరసన ప్రదర్శనలకు దిగినప్పటికీ భయపడని అధికారులకు కార్మికుల ఆందోళనలు వణుకుపుట్టిస్తున్నాయి. ఇతరత్రా శాఖల వారి గురించి పెద్దగా పట్టించుకోని ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ సభ్యులు, రియో నగర పాలక సంస్థ అధికారులు చివరికి పోలీసుల ప్రదర్శనలను కూడా తేలిగ్గా తీసుకున్నారు. పోలీసులు విధులకు హాజరుకాకపోతే, సైన్యం సాయం తీసుకోవచ్చని, ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించుకోవచ్చని ధీమాగా ఉన్నారు. అయితే, కార్మికులు నిరసనలకు దిగడం వారిని ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా కార్మికులు చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారడం అధికారులను మరింత భయపెడుతున్నది. వీరు సహాయ నిరాకరణకు దిగితే ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో వౌలిక సదుపాయాలకు గండిపడుతుందన్న ఆందోళన వారిని నిద్రకు దూరం చేస్తున్నది. శుభ్రపడని టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న ఆలోచనే వారి భయానికి ప్రధాన కారణం. ఒలింపిక్స్ ఆరంభానికి ముందు నుంచే ప్రతి రోజూ టన్నుల కొద్దీ చెత్తాచెదారాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇక ఒలింపిక్స్ సమయంలో పేరుకుపోయే చెత్తను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు, వివిధ దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, సపోర్టింగ్ స్ట్ఫాతోపాటు వందలాది మంది వలంటీర్లకు అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కార్మికుల సమ్మె కారణంగా వౌలిక సదుపాయాలకు గండిపడితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఇప్పటికిప్పుడు కొత్తవారిని తీసుకొని, వారితో పనులు చేయించడం అసాధ్యమని అధికారులకు తెలుసు. పైగా క్రీడా గ్రామం, ఒలింపిక్స్ వేదికలకు సంబంధించిన సమస్త వివరాలు ఇప్పటికే అక్కడ పని చేస్తున్న కార్మికులకు తెలుసు. అన్ని అంశాలపై వారికి అవగాహన ఉంది. అందుకే, వారు సహాయ నిరాకరణకు దిగితే ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల్లడిల్లుతున్నారు.
క్రీడా గ్రామంలో 31 భారీ భవనాలు ఉన్నాయి. అథ్లెట్లు, కోచ్‌లు సుమారు 18,000 మంది క్రీడా గ్రామంలో బస చేస్తారు. ఇప్పటికే ఐదారువేల మంది చేరుకున్నారు. ఇక్కడ మొత్తం 3,600 గదులు ఉండగా, కనీసం 400 గదుల్లో వౌలిక వసతులు కరవైన విషయాన్ని అధికారులు గుర్తించారు. వీటిని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో కార్మికులు ఆందోళనకు దిగడంతో అధికారుల పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది. ఆందోళనలకు దిగుతున్న ఇతరుల విషయం ఎలావున్నా, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారిని శాంతింప చేయాలని ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ, రియో అధికారులు ముక్తకంఠంతో బ్రెజిల్ సర్కారును కోరుతున్నారు.
..................................
ఒలింపిక్ క్రీడాజ్యోతి రక్షణకు బ్రెజిల్ సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒలింపిక్ క్రీడలు జరిగే పలు కేంద్రాల వద్ద వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు నిరసన ప్రదర్శనలకు దిగడంతో, క్రీడాజ్యోతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఆంగ్రా డస్ రీస్‌లో చోటు చేసుకున్న సంఘటనతో ఉలిక్కిపడిన ప్రభుత్వం తన దృష్టిని క్రీడాజ్యోతి రిలేపై మరల్చింది. ఒలింపిక్ టార్చికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, దానికి ఎలాంటి నష్టం కలగకుండా చూసేందుకు భారీగా బలగాలను మోహరించింది.
.......................
chitram...
ఒలింపిక్స్ క్రీడా గ్రామం