క్రీడాభూమి

అశ్విన్ స్పిన్‌కు విండీస్ విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 31: అశ్విన్ స్పిన్ మాయాజాలానికి వెస్టిండీస్ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 52 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు జెర్మైన్ బ్లాక్‌వుడ్ (62), మార్లొన్ శామ్యూల్స్ (37) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లను అందించలేకపోయారు. చివరిలో మిగుల్ కమిన్స్ అజేయంగా 24 పరుగులు చేశాడు. భారత బౌలింగ్‌ను, ప్రధానంగా అశ్విన్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో విఫలమైన విండీస్ కనీసం రెండు వందల పరుగుల మైలురాయిని కూడా చేరకుండానే కుప్పకూలింది. విండీస్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న సందర్భాల్లో ఇంత తక్కువ ఓవర్లకు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 1971లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో, 1979లో చెన్నైలో విండీస్ ఇన్నింగ్స్ 72.5 ఓవర్లకు ముగిసింది. ఇప్పుడు 52.3 ఓవర్లలోనే ఆలౌటైంది. కాగా, తాజా టెస్టు జరుగుతున్న సబీనా పార్క్‌లో విండీస్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు. ఇంగ్లాండ్‌తో 1954లో జరిగిన టెస్టులో 139 పరుగులకు ఆలౌటైన విండీస్ 1990లో 164 పరుగులకు ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ రెండింటి తర్వాత విండీస్‌కు 196 పరుగులు అత్యల్ప స్కోరు.
విండీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయి 126 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో డారెన్ బ్రేవో క్యాచ్ అందుకోగా అవుటైన ధావన్ 52 బంతుల్లో 27 పరుగులు చేశాడు. లోకేష్ రాహుల్ 75, చటేశ్వర్ పుజారా 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు, ఆదివారం ఆటను కొనసాగించిన భారత్ భోజన విరామ సమయానికి మరో వికెట్ కోల్పోకుండా 190 పరుగులకు చేరింది.