క్రీడాభూమి

తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్బన్, డిసెంబర్ 30: మోయిన్ అలీ స్పిన్ బౌలింగ్ ప్రతిభ దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ ముగిసిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్‌కు 241 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందించింది. విజయానికి రెండో ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయాల్సి ఉండగా, మంగళవారం ఆఠ ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన బుధవారం ఉదయం ఆటను కొనసాగించి 174 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్ మోయిన్ అలీ చివరి రోజున కీలక వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌ను విజయపథంలో నడిపాడు. స్టీవెన్ ఫిన్‌కు నాలుగు వికెట్లు లభించగా, మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన మోయిన్ అలీ రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. నైట్‌వాచ్‌మన్ డేల్ స్టెయిన్‌ను ఫిన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో బుధవారం నాటి ఆటలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. వరుస వైఫల్యాలతో అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌పై ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 303 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 214 పరుగుల చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ముందు 416 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని అందుకునే ప్రయత్నంలో దక్షిణాఫ్రికా విఫలమైంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 100.1 ఓవర్లలో 303 ఆలౌట్ (నిక్ కాంప్టన్ 85, జేమ్స్ టేలర్ 70, స్టువర్ట్ బ్రాడ్ నాటౌట్ 32, డేల్ స్టెయిన్ 4/70, మోర్న్ మోర్కెల్ 4/76).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 81.4 ఓవర్లలో 214 ఆలౌట్ (డీన్ ఎల్గార్ 118, ఎబి డివిలియర్స్ 49, మోయిన్ అలీ 4/69).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 102.1 ఓవర్లలో 326 ఆలౌట్ (కాంప్టన్ 49, జో రూట్ 73, జేమ్స్ టేలర్ 42, జానీ బెయిర్‌స్టో 79, డేన్ పిడిట్ 5/153, స్టియాన్ వాన్ జిల్ 3/20).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 416/ ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 136): 71 ఓవర్లలో 174 ఆలౌట్ (ఎల్గార్ 40, డివిలియర్స్ 37, వాన్ జిల్ 33, ఫిన్ 4/42, మోయిన్ అలీ 3/47).

చిత్రం.. దక్షిణాఫ్రికాను తొలి టెస్టులో ఓడించిన ఇంగ్లాండ్ క్రికెటర్ల ఆనందం