క్రీడాభూమి

లోధా కమిటీ సిఫార్సులపై నిర్ణయం బిసిసిఐదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఆగస్టు 2: లోధా కమిటీ సిఫార్సులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ఒక నిర్ణయం తీసుంటుందని, దానికి అనుగుణంగా మాత్రమే తాము పని చేస్తామని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ చెప్పారు. సోమవారం రాత్రి మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన గంగూలీని ఒక అడ్మినిస్ట్రేటర్‌గా, మాజీ క్రికెటర్‌గా లోధా కమిటీ సిఫార్సులపై మీ అభిప్రాయమేమిటని విలేఖరులు ప్రశ్నించినప్పుడు ఆయన నేరుగా తన అభిప్రాయం చెప్పలేదు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఒక నిర్ణయాన్ని ప్రకటించినందున దీనిపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించడం సరికాదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఆయిన గంగూలీ అన్నాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో విండీస్‌పై భారత జట్టు ఆటతీరును గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు వెస్టిండీస్ జట్టు గతంలో ఉన్నంత బలమైన జట్టు కాదని కూడా ఆయన అభిప్రాయ పడ్డాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అడగ్గా, అతను గొప్ప ఆటగాడని, అతను చాలాకాలం భారత జట్టుకు సేవలందిస్తాడని, అంతేకాదు, ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడవుతాడని గంగూలీ అన్నాడు.