క్రీడాభూమి

లోధా కమిటీతో చర్చలకు బిసిసిఐ ప్రతినిధిగా కట్జూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 2: జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడంలో బోర్డుకు సహకరించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ నేతృత్వంలో నలుగురు సభ్యుల న్యాయ నిపుణుల కమిటీని బిసిసిఐ ఏర్పాటు చేసింది. జస్టిస్ లోధా కమిటీతో సంప్రదించడానికి, అలాగే బిసిసిఐకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డు తరఫున జస్టిస్ కట్జూను ఏకైక ప్రతినిధిగా చేయాలని మంగళవారం జరిగిన బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో కట్జూ కాకుండా మరో న్యాయ కోవిదుడు అభినవ్ ముఖర్జీ కూడా ఉన్నారు. జస్టిస్ కట్జూ 2006నుంచి 2011 దాకా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానే కాకుండా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆయన ఢిల్లీ, మద్రాసు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, అలాగే అలహాబాద్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు.
లోధా కమిటీ సిఫార్సులను తప్పకుండా అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాబోయే ఆరు నెలల్లోగా ఈ సిఫార్సులను అమలు చేయడంలో ఈ కమిటీ బిసిసిఐకి సహకరిస్తుంది.