క్రీడాభూమి

హాకీ జట్టుకు శుభశకునం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డీ జెనిరో, ఆగస్టు 2: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రియో డీ జెనిరో నగరానికి చేరుకున్న భారత హాకీ జట్టు మంగళవారం సన్నాహక మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్‌ను మట్టికరిపించింది. అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఆకాష్‌దీప్, పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన రూపీందర్ పాల్ సింగ్ భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు. రియో ఒలింపిక్స్‌లో శనివారం ఐర్లాండ్‌తో పోరాటాన్ని ప్రారంభించనున్న భారత జట్టు అంతకంటే ముందు మరో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడనుంది. బ్రెజిల్‌కు రావడానికి ముందు మాడ్రిడ్‌లో స్పెయిన్ జట్టు చేతిలో ఓటమిని ఎదుర్కొన్న తాము ఇప్పుడు సన్నాహక మ్యాచ్‌లో స్పెయిన్‌పై విజయం సాధించడం శుభశకునమని భారత జట్టు కెప్టెన్ పిఆర్.శ్రీజేష్ తెలిపాడు. స్పెయిన్‌లో వాతావరణం చాలా వేడిగా ఉందని, మాడ్రిడ్‌లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో తీవ్రమైన ఉక్కపోతకు గురయ్యామని, ఇప్పుడు రియోలో ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ భారత జట్టు చక్కగా రాణించి స్పెయిన్‌ను ఓడించడం సంతోషాన్ని కలిగిస్తోందని అతను చెప్పాడు.
ఒలింపిక్ గ్రామానికి సానియా, టిటి జట్టు
ఇదిలావుంటే, హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో పాటు భారత టేబుల్ టెన్నిస్ జట్టు కూడా రియోలో ఒలింపిక్ గ్రామానికి చేరుకుంది. ఒలింపిక్ గ్రామానికి చేరుకున్న తొలి టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాయే. రోజెర్స్ కప్ టోర్నీలో ఆడేందుకు కెనడా వెళ్లిన సానియా మీర్జా మాంట్రియల్ నుంచి రియో డీ జెనిరోకి చేరుకుంది. ఒలింపిక్స్‌లో మూడోసారి దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సానియా మీర్జా ఈసారి మహిళల డబుల్స్ విభాగంలో యువ క్రీడాకారిణి ప్రార్థనా తోంబ్రేతోనూ, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నతోనూ కలసి బరిలోకి దిగనుంది. రియో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్ పోటీలు ఈ నెల 6వ తేదీ నుంచి, మిక్స్‌డ్ డబుల్స్ పోటీలు 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కాగా, భారత టేబుల్ టెన్నిస్ జట్టు సభ్యులు ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్, వౌమా దాస్, మానికా బాత్రా కూడా రియో ఒలింపిక్ విలేజ్‌కి చేరుకున్నారు.
chitram...
స్పెయిన్‌పై ప్రతీకారం తీర్చుకున్న శ్రీజేష్ సేన