క్రీడాభూమి

నర్సింగ్‌కు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: యువ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి లైన్ క్లియర్ అయంది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్లుడబ్ల్యు) అమోదముద్ర వేయడంతో అతనికి రియో టికెట్ ఖాయమైంది. భారత రెజ్లింగ్ సంఘం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విషయాన్ని ధ్రువీకరించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా నర్సిం గ్‌పై తాత్కాలిక వేటు పడిన విషయం తెలిసిందే. అయతే, తాను నిర్దోషినని, ఎవరో తనకు ఉద్దేశపూర్వకంగా మాదక ద్రవ్యాలను కలిపిన నీటిని అందించారని నర్సింగ్ ఆరోపించాడు. దీనిపై సిబి ఐ విచారణకు డిమాండ్ చేసిన అతను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. కాగా, జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) ఇటీవల సమావేశమై నర్సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని యుడబ్ల్యు డబ్ల్యు అధికారులకు విన్నవించింది. అక్కడి నుంచి క్లియరెన్స్ లభిం చడంతో నర్సింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఖాయమైంది.