క్రీడాభూమి

చేజ్ వీరోచిత శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, ఆగస్టు 4: రోస్టన్ చేజ్ వీరోచిత శతకం వెస్టిండీస్‌ను ఓటమి ప్రమాదం నుంచి తప్పించింది. భారత్‌తో జరిగిన రెండో టెస్టును విండీస్ డ్రా చేసుకోవడంలో చేజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 196 పరుగులకు ఆలౌట్‌కాగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లకు 500 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, నాలుగో రోజు భోజన విరామ సమానికి ఐదు వికెట్లు కోల్పోయి 215 పరుగులు సాధించింది. ఈఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజైన గురువారం ఆటను కొనసాగించింది. ఆట ముగిసే సమయానికి షేన్ డౌరిచ్ (74) వికెట్‌ను కోల్పోయి 388 పరుగులు చేసింది. ఆరు వికెట్లు మాత్రమే నష్టపోయి, మ్యాచ్‌ని విండీస్ డ్రా చేసుకునే సమయానికి చేజ్ 137, కెప్టెన్ జాసన్ హోల్డన్ 64 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మ్యాచ్ మూడోరోజు భారీ వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడం విండీస్‌కస కలిసొచ్చిన అంశం. దీనికితోడు జర్మైన్ బ్లాక్‌వుడ్ (63) తొలుత, ఆతర్వాత చేజ్, డౌరిచ్, హోల్డర్ బాధ్యతాయుతమైన ఆట భారత్ విజయాన్ని ఆడ్డుకున్నాయి. ఎంతో కష్టం మీద మ్యాచ్‌ని డ్రా చేసుకున్న విండీస్ ఈ సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది.

చిత్రం.. అజేయ శతకంతో విండీస్‌ను ఆదుకున్న చేజ్‌ను అభినందించి, క్రీడాస్ఫూర్తి చాటుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ