బిజినెస్

వల నిండా.. చేపలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 6: సముద్రంలో చేపల వేటపై పరిమితకాల నిషేధం సత్ఫలితాలనిస్తోంది. ఏప్రిల్ 15 నుండి జూలై 15 వరకు సముద్రంలో చేపల వేటను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో మత్స్యకారులు ఆ మూడు నెలలుపాటు వేటను కొనసాగించలేదు. అయతే ప్రస్తుతం సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు కనకంతలు, నూనెకావెళ్ళు, చందవ వంటి రకాలకు చెందిన చేపలు ఇబ్బడిముబ్బడిగా పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు జీవన పరిస్ధితులు మెరుగవుతున్నాయి. ఈ వేట నిషేధ కాలంలో సముద్రంలోని చేపలు పెట్టే గుడ్లు.. పిల్లలుగా మారి పెద్దవవుతున్నాయ. విరామం తర్వాత వేటకు వెళ్లిన మత్స్యకారుల వలల్లో అవి పడుతున్నాయ.
ముఖ్యంగా ప్రకాశం జిల్లా మత్స్యకారులకు చేపల వేటపై నిషేధం కలిసొస్తోంది. జిల్లాలోని కొత్తపట్నం, ఒంగోలు, నాగులుప్పలపాడు, వేటపాలెం, చినగంజాం, చీరాల, వేటపాలెం, ఉలవపాడు, శింగరాయకొండ, గుడ్లూరు మండలాల్లో 102 కిలోమీటర్ల మేర విస్తారమైన కోస్తా తీరప్రాంతం విస్తరించి ఉంది. 3,050 పడవల ద్వారా 1,800 మంది మత్స్యకారులు నిత్యం వేట కొనసాగిస్తుంటారు. నిరుడు 1,209 కోట్ల రూపాయల మేర మత్స్య సంపద జిల్లా నుండి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, 1,312 కోట్ల రూపాయల మేర లభించింది. దీంతో ఈ సంవత్సరం 1,852 కోట్ల రూపాయల మేర సముద్ర ఉత్పత్తులు దొరుకుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగానే ఈ సంవత్సరం చేపలు బాగా పడుతున్నాయని జిల్లా మత్స్యశాఖాధికారి మహమ్మద్ లాల్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. దీంతో ప్రభుత్వ అంచనాను అధిగమించే అవకాశాలూ లేకపోలేదు. ప్రధానంగా వేట నిషేధ కాలంలో జిల్లాలోని మత్స్యశాఖాధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి మత్య్సకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించటంతో సత్ఫలితాలు వస్తున్నాయని లాల్ అన్నారు. సముద్రంలో చేపల పెరుగుదల బాగుందని దీనికి కారణం జీవవైవిధ్యంలో నెలకొన్న మార్పులేనని ఆయన పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా సునామీ కారణంగా సముద్ర మట్టం పెరిగి సముద్రం ముందుకురావటంతో కూడా చేపల ఉత్పత్తి పెరిగినట్లు సమాచారం. తరుచుగా తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడటంతో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకపోవటంతో ఆ సమయాల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. దీంతో మత్స్యకారుల వలల్లో చేపలు ఎక్కువగా పడుతున్నాయి. మొత్తంమీద వేట నిషేధ కాలంలో మత్స్యశాఖాధికారులు తీసుకున్న చర్యలతో మత్స్యకారులకు ధనరాసుల వర్షం కురుస్తోంది. మరోవైపు వేట నిషేధ కాలంలో వేటను నిషేధించిన వారికి ప్రభుత్వపరంగా రాయితీలను త్వరితగతిన మంజూరు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.