క్రీడాభూమి

డెల్ పొట్రో సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 8: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కి అర్జెంటీనా సీనియర్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రో షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో జొకోవిచ్‌పై 7-6, 7-6 తేడాతో సంచలన విజయం సాధించాడు. అనూహ్య పరాజయంతో కంగుతిన్న జొకోవిచ్ కంటనీరు పెట్టుకొని, అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టును విడిచిపెట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 145వ స్థానంలో ఉన్న డెల్ పొట్రోను ఎవరూ ఈ మ్యాచ్‌లో విజేతగా ఊహించలేదు. జొకోవిచ్ సులభంగానే గెలిచి, ఒలింపిక్ టైటిల్‌ను గెల్చుకునై దిశగా తొలి అడుగు వేస్తాడని విశే్లషకులు సైతం జోస్యం చెప్పారు. కానీ, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న డెల్ పొట్రో ఎవరూ అంచనా వేయలేని విధంగా జొకోవిచ్‌కు గట్టిపోటీనిచ్చాడు. అతి కష్టం మీద వరుస సెట్లలో విజయం సాధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డెల్ పొట్రో ఆనందంతో, జొకోవిచ్ బాధతతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని క్రీడా స్ఫూర్తిని చాటారు.

ప్రపంచ నంబర్ వన్ జొకోవిచ్ ను ఓడిచిన జువాన్ మార్టిన్ డెల్ పొట్రో