క్రీడాభూమి

ఫెల్ప్స్‌కు మరో స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 8: అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఒలింపిక్స్‌లో మరోసారి సత్తా చాటాడు. ఇప్పటికే 18 స్వర్ణ పతకాలతో ఒలింపిక్స్ చరిత్రను తిరగరాసిన అతను పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో అమెరికా గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కెరీర్‌లో 19వ ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకున్నాడు. కాలెబ్ డ్రెసెల్, ర్యాన్ హెల్డ్, నాథన్ ఆడ్రియన్ కూడా సభ్యులుగా ఉన్న అమెరికా జట్టు తన లక్ష్యాన్ని 3 నిమిషాల 9.92 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ 3 నిమిషాల 10.53 సెకన్లతో రజతాన్ని, ఆస్ట్రేలియా 3 నిమిషాల 11.37 సెకన్లతో కాంస్యాన్ని అందుకున్నాడు.
విలియమ్స్ సిస్టర్స్‌కు తొలి ఓటమి
‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ జోడీకి ఒలింపిక్స్‌లో తొలిసారి పరాజయం ఎదురైంది. 2000, 2008, 2012 సంవత్సరాల్లో ఒలింపిక్స్ డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్న వీరు ఇంత వరకూ ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన గత 15 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసింది. మొట్టమొదటిసారి ఓటమిపాలై నిష్క్రమించింది. కడుపునొప్పితో బాధపడుతున్న 36 ఏళ్ల వీనస్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. సెరెనా సర్వశక్తులు ఒడ్డినప్పటికీ ఫలితం లేకపోయింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన లూసీ సఫరోవా, బార్బరా స్ట్రికోవా జోడీతో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో వీరు 3-6, 4-6 తేడాతో ఓడారు. సింగిల్స్ విభాగంలో సెరెనా డిఫెండింగ్ చాంపియన్‌కాగా, వీనస్ 16 ఏళ్ల క్రితం, 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈసారి వీసన్ సింగిల్స్ విభాగం మొదటి రౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన సెరెనా మొదటి రౌండ్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి డరియా గవ్రిలొవాపై గెలిచి ముందంజ వేసింది.

చిత్రాలు.. 19వ ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించిన అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్

డబుల్స్‌లో ఓడిన సెరెనా, వీనస్