క్రీడాభూమి

బిసిసిఐకి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: లోధా కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి మరోసారి చుక్కెదురైంది. ఇప్పటికే సుప్రీం కోర్టు చేతిలో పలుమార్లు చీవాట్లు తిన్న బిసిసిఐకి ఇప్పుడు లోధా ప్యానెల్ నుంచి కూడా తిరస్కరణ తప్పలేదు. కమిటీ సిఫార్సులను ఆరు నెలల్లోగా అమలు చేయాలని బిసిసిఐని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయితే, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపడానికి వీలుగా లోధా ప్యానెల్‌తో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే మంగళవారం సమావేశం కావాల్సి ఉంది. అయితే, లోధా కమిటీ చేసిన సిఫార్సులు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని అమలు చేయాల్సిందిగా బోర్డుకు ఆదేశాలు జారీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు లేదని ఇటీవలే బిసిసిఐ సలహాదారుగా నియమితుడైన జస్టిస్ మార్కండేయ కట్జు చేసిన వ్యాఖ్యలతో షిర్కే కొత్త వ్యూహాన్ని మొదలుపెట్టాడు. మంగళవారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయాల్సిందిగా కోరుతూ లోధా ప్యానెల్‌కు లేఖ రాశాడు. కొంత సమయం లభిస్తే, కోర్టుల ద్వారా స్టే సంపాదించి, లోధా సిఫార్సుల అమలును మరికొంత కాలం ఆలస్యం చేయాలన్నదే షిర్కే ఉద్దేశం. కానీ, లోధా ప్యానెల్ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఒకవేళ అనురాగ్ ఠాకూర్, షిర్కే లోధా ప్యానెల్‌ను కలవకపోతే, అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. ఈ పరిస్థితుల్లో బోర్డు వ్యూహం ఏమిటన్నది ఆసక్తిని రేపుతున్నది.