క్రీడాభూమి

తప్పు మాది కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: భారత మహిళా ఆర్చర్లు రికర్వ్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో పరాజయాన్ని ఎదుర్కోవడంలో తమ తప్పు ఏమీ లేదని, గాలి వేగంగా వీయడం వల్లే గురి తప్పించదని వాదిస్తున్నారు. దీపికా కుమారి, లైష్రామ్ బొంబాల్యా దేవి, లక్ష్మీరాణి సభ్యులుగా ఉన్న భారత జట్టు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో కొలంబియాను ఓడించిన క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా పతకం రేసులో ఉన్నామని సంకేతాలు పంపింది. అయితే, రష్యాతో జరిగిన పోరులో 4-5 తేడాతో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. పోటీల అనంతరం వారు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితి పోటీలకు ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. గాలి వాటం వల్ల గురి తప్పిందని పేర్కొన్నారు. రష్యాతో తుది వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు.

చిత్రం.. దీపికా కుమారి