క్రీడాభూమి

గురితప్పిన బింద్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 8: ఒలింపిక్స్‌లో రెండోసారి పతకాన్ని సాధించాలనుకున్న భారత ఏస్ షూటర్ అభినవ్ బింద్రా ఆశ నెరవేరలేదు. గురి తప్పిన అతను నాలుగో స్థానంతోనే సరిపుచ్చుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో నాలుగో స్థానంతో సంతృప్తి చెందాడు.
క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో బింద్రా 625.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా, మరో భారత షూటర్ గగన్ నారంగ్ 621.7 పాయింట్లతో 23వ స్థానానికి పడిపోయి, ఫైనల్‌కు క్వాలిఫై కాలేదు. బింద్రా ఫైనల్‌లో స్థానం సంపాదించడంతో అతను ఏదో ఒక పతకాన్ని గెల్చుకుంటాడని అభిమానులు ఆశించారు. కానీ, ఫైనల్‌లో 163.8 పాయింట్లు సంపాదించిన అతను పతకాన్ని చేజార్చుకున్నాడు. ఇటలీ షూటర్ నికోలో కాంప్రియానీ 206.1 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించగా, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హీ కలిష్ 204.6 పాయింట్లు సంపాదించి రజత పతకాన్ని అందుకున్నాడు. వ్లాదిమీర్ మెస్లెనికోవ్ (రష్యా) 184.2 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. బింద్రాకు నాలుగో స్థానం దక్కింది.
పురుషుల హాకీలో భారత్ ఓటమి
పురుషుల ఫీల్డ్ హాకీలో జర్మనీని ఢీకొన్న భారత్ 1-2 తేడాతో ఓటమిపాలైంది. చివరి క్షణం వరకూ మ్యాచ్ డ్రాగా ముగిసే సూచనలు కనిపించాయి. అయితే, మరో అర నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా క్రిస్ట్ఫోర్ రూ చేసిన గోల్ జర్మనీని గెలిపించింది. మ్యాచ్ 17వ నిమిషంలో మిక్లాస్ వెలెన్ ద్వారా జర్మనీకి మొదటి గోల్ లభించింది. అయితే, ఎదురుదాడికి దిగిన భారత్‌కు రూపీందర్ పాల్ సింగ్ 22వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను అందించాడు. అనంతరం ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. మ్యాచ్ చివరి నిమిషానికి చేరుకోగా, డ్రా ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ, భారత డిఫెన్స్‌ను ఛేదించిన క్రిస్ట్ఫోర్ రూ చక్కటి గోల్ చేసి, జర్మనీకి విజయాన్ని సాధించిపెట్టాడు.

చిత్రం.. బింద్రా