క్రీడాభూమి

చరిత్ర పుటల్లో దీప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిమ్నాస్టిక్స్‌లో అత్యంత క్లిష్టమైన ‘ప్రొడునొవా’ విన్యాసాన్ని
ప్రదర్శించి భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్‌లో ఫైనల్స్ చేరి చరిత్ర పుటల్లో స్థానం
సంపాదించింది. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి
భారతీయురాలిగా రికార్డు సృష్టించిన దీప క్వాలిఫయింగ్ రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసి ఫైనల్ చేరింది. ప్రాణాలతో
చెలగాటమైన ‘ప్రొడునొవా’ విన్యాసాన్ని ప్రదర్శించిన నాలుగో క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన దీప గొప్ప సాహసమే
చేస్తున్నది. ఎక్కువ పాయింట్లు సంపాదించడానికి ‘ప్రొడునొవా’ ఉపయోగపడుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదమని తెలిసినప్పటికీ, దేశానికి పతకాన్ని అందించాలన్న పట్టుదలతో ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కోవడానికైనా
సిద్ధపడింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే ఆమెకు మొదటి విజయం. క్వాలిఫయర్‌ను పూర్తి చేసి, ఫైనల్ చేరడం మరో విజయం. ఫైనల్ ఫలితం ఎలావున్నా, అభిమానుల దృష్టిలో దీప ఇప్పటికే విజేతగా నిలిచింది.