క్రీడాభూమి

హీనా పిస్టల్ మళ్లీ ‘మిస్‌ఫైర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకొస్తుందని ఆశించిన పిస్టల్ షూటర్ హీనా సిద్ధు మరోసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల 25 మీటర్ల ఈవెంట్‌లో మొత్తం 40 మంది పోటీ పడగా, ప్రథమార్థం ముగిసే సమయానికి సిద్ధు ఎంతో వెనుకబడి 30వ స్థానంలో నిలిచింది. 30 షాట్ ప్రిసిషన్ రౌండ్‌లో మొత్తం 300 పాయింట్లకు గాను హీనా సిద్ధు వరుసగా 95, 95, 96 స్కోర్లతో కేవలం 286 పాయింట్లకు మాత్రమే పరిమితమవడంతో ఈ పరిస్థితి ఏర్పడి రేసులో చాలా వెనుకబడింది. దీంతో తదుపరి జరిగే 30 షాట్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో ఆమె ఎంత పుంజుకున్నప్పటికీ మెడల్ సాధించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
బ్రెజిల్‌కు తొలి స్వర్ణం
సాధించిన సిల్వా
రియో డి జనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్ ఆతిథ్య బ్రెజిల్‌కు రఫీలా సిల్వా తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జూడో 57 కిలోల విభాగంలో సిల్వా ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సుమియా డోర్జ్‌సర్న్‌ను ఓడించి ఆతిథేయ బ్రెజిల్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాదించింది. కాగా, అమెరికాకు చెందిన ఇబ్తిహజ్ ముహమ్మద్ ఒలింపిక్స్‌లో ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఒలింపిక్స్‌లో పోటీ పడిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.

ఈ ఒక్క విజయంతోనే ఆమె పేరు ఒలింపిక్స్‌లో మార్మోగి పోయింది. విజయం సాధించిన తర్వాత సిల్వా సంతోషం పట్టలేక బ్రెజిల్ సంప్రదాయ రీతిలో ఎరీనాలో ఓ గెంతు గెంతి తోటి క్రీడాకారిణులతో కలిసి ఆనందాన్ని పంచుకుంది. సొంత ఊళ్లో సొంత దేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టడంకన్నా మించిన ఆనందం ఏముంటుంది!
కాగా, అమెరికాకు చెందిన ఇబ్తిహజ్ ముహమ్మద్ మహిళల ఫెన్సింగ్ పోటీల్లో తలకు ముస్లింల సంప్రదాయ నల్లటి స్కార్ఫ్ (హిజిబ్)్ధరించి పోటీల్లో పాల్గొనడం ద్వారా ఇలా ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. తొలి పోటీలో విజయం సాధించిన తర్వాత ఆమె సంప్రదాయ పద్ధతిలో శరసు వంచి నమస్కరించింది. ఆమె టీమ్ ఈవెంట్‌లో కూడా పాల్గొంటోంది.
సోమవారం రాత్రి అమెరికాకు చెందిన లిల్లీ కింగ్ మహిళల వందమీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో రష్యాకు చెందిన యులియా ఎఫిమోవాతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. కాగా, అమెరికా పురుషుల బాస్కెట్ బాల్ జట్టు వెనిజులాపై 113-69 పాయింట్ల తేడాతో విజయం సాదించింది. కాగా, మహిళల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో అమెరికాకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరేనా విలియమ్స్, ఫ్రాన్స్‌కు చెందిన అలిజే కోర్నెట్‌పై 7-6, 6-2 స్కోరుతో అతికష్టంమీద విజయం సాధించి వరసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా, నేమార్ లాంటి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు అంతగా పేరు ప్రతిషఠలు లేని ఇరాక్ జట్టుపై ఒక్క గోలు కూడా చేయలేక డ్రా చేసుకోవడాన్ని బ్రెజిల్ సాకర్ అభిమానులు జీర్ణిచుకోలేక పోతున్నారు.