క్రీడాభూమి

రాహుల్ అర్ధ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాస్ ఐలెట్, ఆగస్టు 9: వెస్టిండీస్‌తో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మూడో క్రికెట్ టెస్టు తొలి రోజున భారత్ లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. డారెల్ సమీ స్టేడియంలో బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణయం సరైనదేననిపింది. ఈ టెస్టుకోసం వెస్టిండీస్ రెండు మార్పులు చేసింది ఓపెనర్ రాజేంద్ర చంధ్రిక స్థానంలో లియోన్ జాన్సన్‌ను, లెగ్‌స్పిన్నర్ దేవేంద్ర బిషు స్థానంలో 19 ఏళ్ల యువ ఫాస్ట్‌బౌలర్ అల్జరి జోసెఫ్‌కు స్థానం కల్పించింది. కాగా, భారత్ జట్టులో మూడు మార్పులు చేశారు. చేతేశ్వర్ పుజారా, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్‌ల స్థానంలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ ప్రసాద్‌లకు చోటు కల్పించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 1 పరుగుకు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 పరుగులకే అవుట్ కావడంతో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపించింది. గాబ్రియెల్ బౌలింగ్‌లో ధావన్ స్లిప్‌లో షేన్ డౌరిచ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, 3 పరుగులు చేసిన కోహ్లీ జోసెఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ అర్ధ సెంచరీ చేయడంతో పాటుగా నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అజింక్య రహానేతో కలిసి మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది. కాగా, 69 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వెంటనే రాహుల్ రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. లంచ్ సమయానికి రహానే 17 పరుగులతో, రోహిత్ శర్మ 9 పరుగులతో ఆడుతున్నారు.