క్రీడాభూమి

‘గృహ నిర్బంధం’లో దీప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 9: ఒలింపిక్స్‌లో వాల్ట్స్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారత జిమ్నాస్టుగా చరిత్ర సృష్టించడంతో పాటు కోట్లాది మంది భారత క్రీడాభిమానుల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న దీపా కర్మాకర్‌ను అమె కోచ్ విశే్వశ్వర్ నంది ‘గృహ నిర్బంధం’లో ఉంచాడు. రియో ఒలింపిక్స్‌లో ఆదివారం జరిగే వాల్ట్స్ ఫైనల్స్‌లో మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న దీపా కర్మాకర్‌పై ఎటువంటి వత్తిడి లేకుండా చూసేందుకే నంది ఈ చర్య చేపట్టాడు. త్రిపురలోని కుటుంబ సభ్యులకు ప్రస్తుతం 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మాకర్ మంగళవారం 23వ పడిలో ప్రవేశించింది. అయితే తల్లిదండ్రులతో పాటు ప్రస్తుతం తన వెంట ఉన్న సహచరుల నుంచి మినహా ఇంకెవరి నుంచీ జన్మదిన శుభాకాంక్షలు అందుకునేందుకు ఆమె ఇష్టపడలేదు. 14వ తేదీన జరిగే వాల్ట్స్ ఫైనల్స్‌పై కర్మాకర్ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడమే ఇందుకు కారణం. రియో ఒలింపిక్ విలేజ్‌లో ప్రస్తుతం కర్మాకర్ వెంట ఆమె రూమ్‌మేట్, భారత ఏకైక మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానూ, 16 ఏళ్ల నుంచి శిక్షణ ఇస్తున్న కోచ్ నంది మాత్రమే ఉన్నారు. ‘ఫైనల్స్‌కు సిద్ధమవుతున్న దీప ఏకాగ్రత దెబ్బతినకుండా చూసేందుకు ఆమె మొబైల్ ఫోన్ నుంచి సిమ్ కార్డును తొలగించేశా. తల్లిదండ్రులను తప్ప మరెవరినీ దీపతో మాట్లాడేందుకు అనుమతించడం లేదు’ అని రియో ఒలింపిక్ విలేజ్ నుంచి విశే్వశ్వర్ నంది టెలిఫోన్ ద్వారా పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.
భయమేమీ లేదు..
ఇదిలావుంటే, వాల్ట్స్ ఫైనల్స్‌లో రాణిస్తానా? లేదా? అనే విషయం గురించి తానేమీ భయపడటం లేదని దీపా కర్మాకర్ స్పష్టం చేసింది. ‘నేనెందుకు వత్తిడికి గురికావాలి?, వాల్ట్స్ ఫైనల్స్‌కు చేరుకున్న నేను ప్రస్తుతం దీనిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించి శక్తివంచన లేకుండా ఉత్తమ ప్రదర్శనతో రాణించాలని ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకూ ఇక్కడ అంతా బాగానే ఉంది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో నేను కాస్త తడబడినప్పటికీ ఇప్పుడు అంతా సజావుగానే ఉంది. నేనేమీ వత్తిడికి గురికావడం లేదు’ అని ఆమె తెలిపింది.