క్రీడాభూమి

పాత్రికేయుల బస్సుపై బులెట్ల వర్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 10: రియో ఒలింపిక్స్‌లో రోజుకో అపశృతి దొర్లుతోంది. నిరసన ప్రదర్శనలు, సౌకర్యాల లేమి వంటివి సాధారణమైతే, తాజాగా పాత్రికేయులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. బరా ప్రాంతంలోని హాకీ పార్క్‌లో జరిగిన బాస్కెట్‌బాల్ మ్యాచ్‌ని తిలకించిన తర్వాత మెయిన్ స్టేడియంలోని మీడియా సెంటర్‌కు బయలుదేరిన జర్నలిస్టుల వాహనంపై దాడి జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించింది. దాడిలో బస్సులోని రెండు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో బస్సులో మొత్తం 12 మంది ఉన్నారు. బుల్లెట్ల వర్షం కురడం మొదలైన వెంటనే అందరూ సీట్ల నుంచి లేచి కింద పడుకున్నారు. డ్రైవర్ బస్సు వేగాన్ని తగ్గించగా, ఎక్కడా ఆపవద్దంటూ కేకలు వేశారు. కొద్ది దూరం వెళ్లిన డ్రైవర్ ఈ సంఘటనను గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షణాల్లో భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని, బస్సులోని జర్నలిస్టులను మరో వాహనంలో మీడియా సెంటర్‌కు తరలించారు. పగిలిన బస్సు అద్దాలు తగిలి చిన్నచిన్న గాయాలు మినహాయిస్తే అందరూ క్షేమంగా ఉండడంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు సమీపం నుంచి వెళుతున్న టర్కీకి చెందిన ఓ వలంటీరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.