క్రీడాభూమి

అశ్విన్, సాహా సెంచరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాస్ ఇస్లెట్, ఆగస్టు 10: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లోనూ రాణించి అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా సెంచరీ సాధించాడు. అశ్విన్‌కు ఇది కెరీర్‌లో నాలుగో సెంచరీ. సాహా ఖాతాలో ఇదే తొలి టెస్టు సెంచరీ. కాగా, వెస్టిండీస్‌పై టెస్టుల్లో కనీసం ఐదు ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అత్యధిక సగటును అశ్విన్ సాధించడం విశేషం. ఈ విషయంలో అతను ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్‌ను అధిగమించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడే విండీస్‌పై అతని సగటు 66.57 పరుగులకు చేరింది. గవాస్కర్ 65.45 సగటుతో రెండో స్థానానికి పడిపోయాడు. కాగా, ఐదు వికెట్లకు 234 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు అశ్విన్, వృద్ధిమాన్ సాహా భారీ స్కోరును అందించే దిశగా చక్కటి ఆటను ప్రదర్శించారు. మొదట అశ్విన్ సెంచరీని సాధించగా, ఆ వెనుకలో సాహా కూడా వంద పరుగుల మైలురాయని చేరాడు. అతను శతకాన్ని 224 బంతుల్లో చేశాడు. 104 పరుగులు చేసిన అతను అల్జారీ జోసెఫ్ బౌ లింగ్‌లో షేన్ డౌరిచ్ క్యాచ్ అందుకోగా అవు టయ్యాడు. కడపటి వార్తలు అందే సమయా నికి భారత్ 6 వికెట్లకు 350 పరుగులు చేసింది. అశ్విన్ (117), జడేజా (5) క్రీజ్‌లో ఉన్నారు