క్రీడాభూమి

సెరెనాకు స్విటోలినా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు రియో ఒలింపిక్స్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. సోదరి వీనస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగి ఓటమిపాలైన సెరెనాకు సింగిల్స్‌లోనూ అదే పరిస్థితి తప్పలేదు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆమెను ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటోలినా 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల సెరెనా తన కంటే 13 సంవత్సరాల చిన్నదైన స్విటోలినా చేతిలో ఓడడం పరిశీలకులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటి వరకూ నాలుగు పర్యాయాలు ఒలింపిక్ స్వర్ణాలను గెల్చుకున్న సెరెనా ఐదోసారి పతకం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేత గార్బినే ముగురుజా ఎవరూ ఊహించని విధంగా పోర్టారికోకు చెందిన మోనికా పగ్ చేతిలో 1-6, 1-6 తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెరెనా కూడా అదే దారిలో నడిచింది. ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో టాప్ స్టార్ల హవా కొనసాగుతున్నది. రెండో సీడ్ ఆండీ ముర్రే, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ప్రీ క్వార్టర్స్ చేరారు. ముర్రే 6-3, 6-1 తేడాతో జువాన్ మొనాకో (అర్జెంటీనా)ను ఓడించాడు. నాదల్ 6-3, 6-3 ఆధిక్యంతో ఇటలీ ఆటగాడు ఆడ్రియాస్ సిప్పీపై విజయం సాధించాడు.