క్రీడాభూమి

ఫెల్ప్స్ విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఫెల్ప్స్ మొత్తం 79 పతకాలను సాధించాడు. వీటిలో 64 స్వర్ణాలు. 13 రజతాలు, మూడు కాంస్యాలు కూడా అతను గెల్చుకున్న పతకాల జాబితాలో ఉన్నాయి. ఎన్నో ఒలింపిక్, ప్రపంచ రికార్డులు అతని సరసన చేరి మురిసిపోతున్నాయి. ప్రపంచ స్విమ్మింగ్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ సాధించనన్ని రికార్డులు, పతకాలు సొంతం చేసుకున్న ఫెల్ప్స్‌ను అధిగమించడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదన్నది వాస్తవం. ఒలింపిక్స్‌లో అతను అందుకున్న పతకాలు చాలా దేశాల కంటే ఎక్కువ కావడం విశేషం.

రియో డి జెనీరో, ఆగస్టు 10: అమెరికాకు చెందిన ప్రపంచ మేటి స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈత కొలనులో తనకు తిరుగులేదని తాజా ఒలింపిక్స్‌లోనూ రుజువు చేసుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం, లండన్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ప్రటించిన అతను ఇటీవలే మనసు మార్చుకొని మళ్లీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నాడు. రియో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకూ పోటీపడిన మూడు విభాగాల్లోనూ స్వర్ణాలను కైవసం చేసుకున్నాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో విజేతగా నిలవడం ద్వారా అతను కెరీర్‌లో 19వ ఒలింపిక్ పతకాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. అదే ఊపును కొనసాగిస్తూ, 4న100 మీటర్ల ఫ్రీస్టయిల్, 4న200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లోనూ స్వర్ణ పతకాలను సాధించాడు. ఒలింపిక్స్‌లో అతని స్వర్ణ పతకాల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. మొత్తం మీద 25వ ఒలింపిక్ పతకాన్ని ఫెల్ప్స్ గెల్చుకున్నాడు. అతని ఖాతాలో 21 స్వర్ణాలతోపాటు రెండు రజతాలు, మరో రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. కాగా, రియోలో మరో మూడు రేసుల్లో అతను పోటీపడాల్సి ఉంది.
రియోలో మొదట 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో ఫెల్ప్స్ పోటీపడ్డాడు. ఈ విభాగంలో దాదాపుగా పరాజయం అన్నదే లేకుండా అతని జైత్రయాత్ర కొనసాగుతున్నది. అదే స్థాయిలో రాణించిన అతను ఒక నిమషం 53.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. మసటో సకాయ్ (జపాన్)కి రజతం, తమాస్ కెండెరెసీ (హంగరీ)కి కాంస్య పతకం లభించాయి. కాగా, 4న100మీటర్ల ఫ్రీస్టయిల్ రీలో సిలెబ్ డ్రెసెల్, ర్యాన్ హెల్డ్, నాథన్ ఆడ్రియన్‌తో కలిసి పోటీపడిన ఫెల్ప్ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరు లక్ష్యాన్ని 3 నిమిషాల 09.92 సెకన్లలో చేరుకొని స్వర్ణ పతకాన్ని అందుకోగా, మెదీ మెటెల్లా, ఫాబియెన్ గిలోట్, ఫ్లోరెంట్ మనౌడౌ, జెరెమీ స్ట్రావిస్ సభ్యులుగా గల ఫ్రాన్స్ జట్టు 3 నిమిషాల 10.53 సెకన్లతో రజత పతకాన్ని సాధించింది. జెమెస్ రాబర్ట్స్, కేల్ కాల్మెర్స్, జేమ్స్ మాగ్నసెన్, కామెరాన్ మెక్‌ఎవోయ్ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా 3 నిమిషాల 11.37 సెకన్లతో కాంస్య పతకాన్ని స్వీకరించింది.
ఈ ఒలింపిక్స్‌లో రెండవ, మొత్తం మీద ఒలింపిక్స్‌లో 20వ స్వర్ణ పతకాన్ని సాధించిన తర్వాత ఫెల్ప్స్ ఆతర్వాత 4న200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లోనూ రాణించాడు. ర్యాన్ లొచే, టౌనే్ల హాస్, కానర్ డ్వయర్‌లతో కలిసి బరిలోకి దిగాడు. ఈ జట్టు 7 నిమిషాల 0.66 సెకన్లలో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచింది. స్టెఫెన్ మిల్నే, డంకన్ స్కాట్, డానియల్ వాలెస్, గేమ్స్ గేలతో కూడిన గ్రేట్ బ్రిటన్ జట్టు 7 నిమిషాల 3.13 సెకన్లతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొసుకే హగినో, నయితో ఎహారా, యుకీ కొబోరీ, తకెషి మసూదా సభ్యులుగా ఉన్న జపాన్‌కు కాంస్య పతకం లభించింది. ఈ జట్టు 7 నిమిషాల, 3.50 సెకన్లలో గమ్యాన్ని చేరింది. మొత్తానికి 20కిపైగా ఒలింపిక్స్ స్వర్ణ పతకాలను, మొత్తం మీద 25 లేదా అంతకు మించి పతకాలను సాధించిన తొలి అథ్లెట్‌గా ఫెల్ప్స్ రికార్డు పుస్తకాల్లో చేరాడు. అతను 21 స్వర్ణం, రెండు రజతం, రెండు కాంస్యాలతో మొత్తం 25 పతకాలను సాధించగా, ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన మహిళా జిమ్నాస్ట్ లారిసా లాటినినా 9 స్వర్ణం, 5 రజతం, 4 కాంస్యాలతో మొత్తం 18 పతకాలను కైవసం చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్‌కే చెందిన నికొలయ్ ఆండ్రియానొవ్ ఏడు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 15 పతకాలను గెల్చుకొని ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. స్వర్ణాల పరంగా చూస్తే ద్వితీయ స్థానంలో ఉన్న లాటినినా కంటే ఫెల్ప్స్ రెట్టింపు కన్నా ఎక్కువ పతకాలను గెల్చుకోవడం గమనార్హం.

కెరీర్‌లో 21వ ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని స్వీకరించిన అమెరికా స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్.
(పక్కన) పురుషుల 4న200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో లక్ష్యం దిశగా దూసుకెళుతున్న ఫెల్ప్స్