క్రీడాభూమి

రెంజిత్, శ్రావణి అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 15: అథ్లెటిక్స్‌లో భారత్ ఫ్లాప్ షోకు తెరపడడం లేదు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో రెంజిత్ మహేశ్వరి, మహిళల 200 మీటర్ల పరుగులో శ్రావణి నందా ఫైనల్స్‌కు చేరుకోలేక నిష్క్రమించారు. రెంజిత్ అత్యుత్తమంగా 16.13 మీటర్ల దూరానికి దూకి, 38 మంది పోటీదారుల్లో 30వ స్థానంలో నిలిచాడు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ జంపర్‌గా పేరు తెచ్చుకున్న అతను ఒలింపిక్స్‌లో గట్టిపోటీని ఇవ్వడానికి అవసరమైన ప్రమాణాలను సంపాదించలేకపోయాడు. కాగా, శ్రావణి 200 మీటర్లను 23.58 సెకన్లలో చేరింది. 72 మంది పోటీదారుల్లో ఆమెది 55వ స్థానం. మేరీ జొసీ టలో (కోటె డివోర్) 22.31 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి అగ్రస్థానాన్ని ఆక్రమించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన డిజా స్టీవెన్ 22.45 సెకన్లు, టోరీ బొవీ 22.47 సెకన్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో మొదటి 24 స్థానాలను దక్కించుకున్న వారు ఫైనల్స్‌కు చేరుకున్నారు. శ్రావణిసహా మిగతా వారంతా ఇంటిదారి పట్టారు.

చిత్రం.. రెంజిత్ మహేశ్వరి