క్రీడాభూమి

గ్రీకో రోమన్ బౌట్‌లో హర్దీప్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్ హర్‌దీప్ సింగ్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. మంగళవారం ఇక్కడ 98 కిలోల విభాగంలో టర్కీకి చెందిన ఇల్దెమ్ సెంక్‌తో జరిగిన ఓపెనింగ్ బౌట్‌లో అతను టెక్నికల్ పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఈ బౌట్‌లో హర్దీప్ సింగ్ (25) నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైనప్పటికీ టర్కీ రెజ్లర్ 2-1 తేడాతో విజయం సాధించాడు. వాస్తవానికి ఈ బౌట్ తొలి రౌండ్‌లో హర్దీప్ ఎంతో అద్భుతంగా పోరాడి ప్రత్యర్థిని ముప్ప తిప్పలు పెట్టడంతో అతనికి రిఫరీ అడ్వాంటేజ్ ఇచ్చాడు. ఈ రౌండ్‌లో హర్దీప్ ప్రత్యర్థిని మట్టికరిపించినప్పటికీ టెక్నికల్ పాయింట్లు రాబట్టుకునేందుకు అవసరమైన ఫ్లిప్‌ను సాధించడంలో అతను విఫలమయ్యాడు. దీనిని అదనుగా చేసుకుని రెండో రౌండ్‌లో విజృంభించిన సెంక్ సమర్థవంతమైన ఫ్లిప్‌తో రెండో పాయింట్లు సాధించాడు. అయితే ఫైనల్ రౌండ్‌లో హర్దీప్ సింగ్ ఒక పాయింట్‌ను రాబట్టుకో గలిగినప్పటికీ అప్పటికే కాలాతీతమైపోయింది. దీంతో 20 ఏళ్ల సెంక్ విజేతగా నిలిచాడు. అయితే సెంక్ గనుక ఫైనల్‌కు చేరితే రెప్‌చేజ్ విభాగంలో హర్దీప్‌కు ఇంకా అవకాశం ఉంటుంది.

చిత్రం..సెంక్‌తో తలపడుతున్న హర్దీప్ (ఎడమ)