క్రీడాభూమి

బాక్సింగ్‌లో ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు ఘోరంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు. ఈ పోటీల్లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఆసియా క్రీడల మాజీ పసిడి పతక విజేత వికాస్ కృష్ణన్ (75 కిలోలు) క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన రెండో సీడ్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజియెవ్ చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. దీంతో బాక్సింగ్ విభాగంలో భారత్ కనీసం ఒక్క పతకాన్ని కూడా సాధించకుండానే తన పోరాటాన్ని ముగించాల్సి వచ్చింది. రియోలో భారత బాక్సర్లు శివ థాపా (56 కిలోలు), మనోజ్ కుమార్ (64 కిలోలు) ఇప్పటికే తమతమ విభాగాల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించిన విషయం విదితమే. తాజాగా 75 కిలోల విభాగంలో వికాస్ కృష్ణన్ కూడా చేతులెత్తేయడంతో బాక్సింగ్ ఈవెంట్‌లో భారత్ పోరాటానికి పూర్తిగా తెరపడింది. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మహిళా బాక్సర్ మేరీ కోమ్ (51 కిలోలు) కాంస్య పతకాన్ని అందించినప్పటికీ ఒక్క పతకాన్ని కూడా సాధించలేకపోయిన పురుష బాక్సర్లు ఇప్పుడు రియో ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి విఫలమయ్యారు. దీంతో ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలుచుకున్న ఒకే ఒక్క భారత పురుష బాక్సర్‌గా విజేందర్ సింగ్ (75 కిలోలు) ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్‌లో అతను కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.

చిత్రం..ప్రత్యర్థిపై పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరినా
వికాస్ కృష్ణన్ (ఎడమ)కు తప్పని ఓటమి