క్రీడాభూమి

బైల్స్‌కు ఎదురు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్ మహిళా జిమ్నాస్టిక్స్‌లో అయిదు స్వర్ణ పతకాలు సాధించాలన్న సైమన్ బైల్స్ ప్రయత్నానికి బీమ్ విభాగంలో మూడోస్థానానికి పరిమితం కావడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విభాగంలో నెదర్లాండ్స్‌కు చెందిన సనే్న వేవర్స్ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే టీమ్ ఈవెంట్‌తో పాటుగా ఆల్‌రౌండ్, వాల్ట్ విభాగాల్లో బైల్స్ స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే బీమ్ ఎక్సర్‌సైజెస్ విభాగంలో ఆమె 14.733 పాయింట్లు మాత్రమే సాధించింది. 2013 తర్వాత 19 ఏళ్ల బైల్స్ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్లో ఒడిపోవడం ఇదే మొదటిసారి. 24 ఏళ్ల వేవర్స్ 15.466 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా అమెరికాకు చెందిన లారెన్ హెర్నాండెజ్ 15.333 పాయింట్లతో రజత పతకం దక్కించుకుంది. గత ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో బైల్స్ ప్రథమస్థానంలో రాగా, వేవర్స్ రెండో స్థానంలో నిలిచింది.ప్రారంభంలో మంచి ప్రతిభను కనబరిచినప్పటికీ చివర్లో లాండ్ అయ్యే సమయంలో నేలపై చేతులు మోపడంతో బైల్స్ స్వర్ణ పతకం చేజార్చుకోవలసి వచ్చింది. అయితే మంగళవారం జరిగే ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ ఫైనల్లో బైల్స్ నాలుగో స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటివరకు సోవియట్ జిమ్నాస్ట్ లారిస్సా లట్యనినా (1956), చెకొస్లవేకియాకు చెందిన వేరా కస్లవాస్కా (1968) రుమేనియాకు చెందిన ఎకటేరినా జాబో(1984)లు ఇప్పటివరకు ఒకే ఒలింపిక్స్‌లో నాలుగేసి స్వర్ణ పతకాలు సాధించారు.

చిత్రం..సైమన్ బైల్స్