క్రీడాభూమి

హెరాత్ స్పిన్ మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 17: రంగన హెరాత్ స్పిన్ మాయాజాలం ఆస్ట్రేలియాపై శ్రీలంకకు తిరుగులేని విజయాన్ని అందించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. 324 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో కేవలం 160 పరుగులకే కుప్పకూలింది. హెరాత్ 64 పరుగులిచ్చి ఏడు వికెట్లు కూల్చి, లంకకు చారిత్రక విజయాన్ని సాధించిపెట్టాడు. ఆసీస్ వరుసగా మూడోసారి ఆసియా దేశాల చేతిలో ఓటమిని చవిచూసింది. 2012-13 సీజన్‌లో భారత్ చేతిలో 0-4 తేడాతో ఓడిన ఆస్ట్రేలియా 2014-15 సీజన్‌లో పాకిస్తాన్‌ను ఢీకొని 0-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. తాజాగా శ్రీలంక చేతిలోనూ వైట్‌వాష్ వేయించుకుంది. పల్లేకల్ టెస్టులో 106 పరుగులు, గాలే టెస్టులో 229 పరుగుల తేడాతో విజయాలను సాధించిన శ్రీలంక మూడో టెస్టులో 163 పరుగుల ఆధిక్యంతో గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 355 ఆలౌట్.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 379 ఆలౌట్.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్లకు 312 పరుగులు): 99.3 ఓవర్లలో 347 ఆలౌట్ (కుశాల్ సిల్వ 115, దినేష్ చండీమల్ 43, ధనంజయ డి సిల్వ 65 నాటౌట్, నాథన్ లియాన్ 3/1230, మిచెల్ స్టార్క్ 2/72, జాన్ హోలాండ్ 2/72).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 324): 44.1 ఓవర్లలో 160 ఆలౌట్ (డేవిడ్ వార్నర్ 68, మిచెల్ స్టార్క్ 23, షాన్ మార్ష్ 23, హెరాత్ 7/64, దిల్‌రువాన్ పెరెరా 2/71).

భారత్‌కు లాభం!
దుబాయ్: శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడడం వల్ల ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయంది. ఈ ఫలితం వల్ల లంక 95 పాయంట్లు సంపాదించుకోగా, భారత్ ఎక్కువగా లాభపడింది. తన ప్రయత్నం లేకుండానే ఏకంగా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుండగా, ఆ మ్యాచ్‌ని కూడా గెల్చుకుంటే టీమిండియాకు నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించే అవకాశాలు మెరుగుపడేవి. అయతే, లంక చేతిలో ఆసీస్ ఓడడం పరోక్షంగా లాభించి, టీమిండియాను నంబర్ వన్ స్థానానికి చేర్చింది.