క్రీడాభూమి

పోరాడి ఓడిన శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: బాడ్మింటన్ పురుషుల విభాగంలో తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ పోరాటానికి తెరపడింది. చైనాకు చెందిన మూడోసీడ్ లిన్ డాన్‌తో చివరి వరకూ హోరాహోరీగా పోరాడిన శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. మొదటి సెట్‌లో ఏమాత్రం పోటీని ఇవ్వలేక చేతులెత్తేసిన శ్రీకాంత్ రెండో సెట్‌లో అనూహ్యంగా ఎదురుదాడికి దిగాడు. లిన్ డాన్‌ను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసిన అతను ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో కీలకమైన చివరి సెట్‌లో ఇరువురు ఆటగాళ్లు నువ్వానేనా అన్న చందంగా పోరాటం సాగించారు. విజయం కోసం శ్రీకాంత్ ఎంత శ్రమించినా, ర్యాంకింగ్స్‌లో తన కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న లిన్ డాన్‌ను అధిగమించలేకపోయాడు. మహిళల సింగిల్స్‌లో పివి సింధును మినహాయిస్తే, మిగతా వారంతా వైఫల్యాలను చవిచూడగా, ఆ జాబితాలో శ్రీకాంత్ కూడా చేరాడు. ఈ ఈవెంట్‌లో భారత అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు సింధుపై ఉన్నాయి. సెమీస్‌ను నెగ్గి ఆమె ఫైనల్ చేరుకుంటే, భారత్‌కు ఒక పతకం ఖాయమవుతుంది. ఒకవేళ మ్యాచ్‌ని కోల్పోతే, కాంస్య పతకం కోసం జరిగే క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో ఏ విధంగా రాణిస్తుందనే అంశంపైనే భారత్‌కు పతకం లభించే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.