క్రీడాభూమి

ఫైనల్‌పై కనే్నసిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పివి సింధు బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాను ఢీకొననున్న ఆమె క్వార్టర్స్‌లో ఇహాన్ వాంగ్‌ను 22-20, 21-19 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత రెండో బాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2012 రియో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన సైనా నెహ్వాల్ ఆతర్వాత కాంస్య పతకాన్ని అందుకుంది. అప్పుడు రజత పతకాన్ని కైవసం చేసుకున్న ఇహాన్ వాంగ్‌ను సింధు ఈసారి క్వార్టర్స్‌లో వరుస సెట్లలో చిత్తుచేయడం విశేషం. ఇహాన్ వాంగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తన కెరీర్ అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఒకటని సింధు పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది. ఒలింపిక్స్‌లో ఆడడమే ఒక అద్భుత అనుభూతిని కలిగిస్తుందని, ఒక్కో మ్యాచ్‌ని గెలవడం ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పింది. ఇంకా సాధించాల్సినవి చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆటపై దృష్టి కేంద్రీకరించి, చివరి వరకూ పోరాడితే విజయాలు సాధ్యమవుతాయని తెలిపింది. సెమీస్‌లో జపాన్ క్రీడాకారిణి నొజొమో ఒకుహరాతో పోరును గురించి ప్రస్తావించగా, జరగబోయే మ్యాచ్‌పై తన దృష్టి లగ్నమైందని చెప్పింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ని ఓడిపోతానేమోనన్న భయం తనకు ఏ దశలోనూ కలగలేదని, అయితే, పోటీ తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రతి మ్యాచ్ కోసం సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చిందని సింధు చెప్పింది. సెమీస్‌లోనూ అనే స్థియిలో ఆడతానని తెలిపింది.