క్రీడాభూమి

500 పరుగుల పిచ్‌లపై మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు రారు : కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 27: స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లను తయారు చేయాలన్న పాలసీ ఏదీ లేదని, అయితే, పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఎప్పటికే మ్యాచ్‌ని గెలిచే బౌలర్లను తయారు చేయలేమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసాడు. ‘ అది ఒక పాలసీ కాదు. అయితే భారత్‌లో ఉండే పరిస్థితి అది. లేదంటే 500కు పైగా పరుగలు చేసే పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌లు అడాల్సి ఉంటుంది.. అలాంటి పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌లను గెలిచే బౌలర్లను తయారు చేయలేం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా టెస్టు మ్యాచ్‌లు గెలవాలంటే బౌలర్లే కీలకం..ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దానికి అనుగుణంగా మీ ఆటను మలుచుకోవాలి’ అని కోహ్లీ శుక్రవారం ఇక్కడ మూడో టెస్టు ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. ‘అంతేకాదు, శ్రీలంకలోని గాలేలో భారత జట్టు కుప్పకూలినప్పుడు ఫాస్ట్‌బౌలింగ్‌ను ఆడడంలో మేము మెరుగుపడ్డాము కానీ స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలియదని కొందరు విమర్శించారు. ఇప్పుడు మేము స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లపై ఆడినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలో అర్థం కావడం లేదు’ అని కోహ్లీ అన్నాడు. అంతేకాదు ఎక్కడో కూర్చుని పిచ్ గురించి ఎలా విమర్శలు చేస్తారంటూ విదేశాలకు చెందిన కొందరు మాజీ క్రికెటర్లపైనా కోహ్లీ ధ్వజమెత్తాడు.
నాకెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన పిచ్: ఆమ్లా
కాగా, తన క్రికెట్ కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠిన పరిస్థితులు ఇవి అని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా వ్యాఖ్యానించాడు. అంతేకాదు బహుశా తన కెరీర్‌లోనే ఇంత క్లిష్టమైన పిచ్‌పై ఆడలేదని కూడా ఆయన అన్నాడు. కాగా, భారత బౌలర్లు నిజంగానే బాగా బౌల్ చేసారంటూ ఆమ్లా కితాబిచ్చాడు. చివరి ఇన్నింగ్స్‌లో 200 పరుగుల లక్ష్యం ఉండి ఉంటే సాధించి ఉండేవాళ్లమేమోనని కూడా అభిప్రాయ పడ్డాడు.
అయితే స్పిన్ పిచ్‌లపై దక్షిణాఫ్రికా ఆటగాళ్లలాగానే భారత ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడ్డారని ఆమ్లా అభిప్రాయ పడ్డాడు.

హ్యూమ్ రెండో హ్యట్రిక్
ఐఎస్‌ఎల్ సెమీస్‌కు అట్లెటికో

కోల్‌కతా, నవంబర్ 27: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డీ కోల్‌కతా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి స్టేడియంలో శుక్రవారం ఆ జట్టు 4-1 గోల్స్ తేడాతో పుణే సిటీ ఫుట్‌బాల్ క్లబ్ జట్టును మట్టికరిపించింది. ఇయాన్ హ్యూమ్ ఈ సీజన్‌లో రెండోసారి హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించి అట్లెటికో విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ప్రస్తుత సీజన్‌లో సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా అట్లెటికో అవతరించింది.

బ్రసిల్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో
సత్తా చాటిన అత్రి, సుమిత్

రియో డీ జెనిరో, నవంబర్ 27: బ్రెజిల్ రాజధాని రియో డీ జెనిరోలో జరుగుతున్న బ్రసిల్ ఓపెన్ గ్రాండ్ ప్రీ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత షట్లర్లు మను అత్రి, బి.సుమీత్ రెడ్డి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు అమెరికాకు చెందిన మాథ్యూ ఫోగర్టీ, జోర్న్ సెగుయిన్ జోడీని మట్టికరిపించారు. కేవలం 24 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో అత్రి, సుమిత్ 21-14, 21-9 తేడాతో సునాయాసంగా విజయం సాధించి కెరీర్‌లోనే తొలిసారి సెమీస్‌కు చేరారు. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్న రియోసెంట్రోలో ప్రయోగాత్మకంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.

హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ ఆదిలోనే భారత్‌కు ఓటమి

రాయ్‌పూర్, నవంబర్ 27: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టుకు శుభారంభం లభించలేదు. రాయ్‌పూర్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ స్టేడియంలో శుక్రవారం అర్జెంటీనాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 0-3 గోల్స్ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టుకు గోంజాలో పిల్లట్ 3వ, 60వ నిమిషాల్లో పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ అందించగా, 24వ నిమిషంలో జోవాక్విన్ మెనిని మరో గోల్ సాధించిపెట్టాడు. కనీసం ఒక్క గోల్ కూడా సాధించకుండా ఘోరంగా చతికిలబడిన భారత జట్టు శనివారం తదుపరి మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో తలపడనుండగా, అర్జెంటీనా జట్టు