క్రీడాభూమి

ఎలైన్ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ మహిళల 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకు ముందు 100 మీటర్ల విభాగంలోనూ విజేతగా నిలిచిన ఆమె ‘సూపర్ డబుల్’ను సాధించింది. హోరాహోరీగా సాగిన 200 మీటర్ల పరుగును ఎలైన్ 21.78 సెకన్లలో పూర్తి చేసింది. నెదర్లాండ్స్‌కు చెందిన డఫ్నే షిపర్స్ 21.88 సెకన్లతో రజత పతకాన్ని అందుకోగా, అమెరికా అథ్లెట్ టొరీ బొవీ 22.15 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకాన్ని స్వీకరించింది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్‌నెర్ తర్వాత మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలను సాధించిన తొలి అథ్లెట్‌గా ఎలైన్ రికార్డు సృష్టించింది.
హర్డిల్స్‌లో అమెరికా క్లీన్‌స్వీప్
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో అమెరికా క్లీన్‌స్వీప్ చేసింది. బ్రియానా రోవలిన్స్ 12.48 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది. నియా అలీ 12.59 సెకన్లతో రజతం, క్రిస్టినీ కాస్టిలిన్ 12.61 సెకన్లతో కాంస్య పతకాలను అందుకున్నారు.

చిత్రం.. మహిళల 200 మీటర్ల పరుగులో అందరి కంటే ముందుగా లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించిన జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్