క్రీడాభూమి

బ్రెజిల్ ఆశలపై నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 18: మొట్టమొదటిసారి ఒలింపిక్స్ మహిళల ఫుట్‌బాల్‌లో ఫైనల్ చేరాలన్న బ్రెజిల్ ఆశలు గల్లంతయ్యాయి. పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్వీడన్ 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో జర్మనీతో పోరాటానికి రంగాన్ని సిద్ధం చేసుకుంది. సాకర్‌కు మారుపేరుగా నిలిచే బ్రెజిల్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తూ ఫైనల్ చేరలేకపోవడం అభిమానులను నిరాశ పరచింది. షూటౌట్‌లో ఈ జట్టు తరఫున మార్టా, ఆండ్రెస్సా అల్వెస్, రాచెలే గోల్స్ చేయగా, క్రిస్టియానే, ఆండ్రసా విఫలమయ్యారు. స్వీడన్ క్రీడాకారిణుల్లో అస్లానీ గోల్ చేయలేకపోయింది. అయితే, షెలిన్, సెగర్, ఫిచెర్, డాల్కివిస్ట్ తమతమ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వీడన్‌ను ఫైనల్ చేర్చారు. మరో సెమీ ఫైనల్‌లో కెనడాను 2-0 తేడాతో ఓడించిన జర్మనీ ఫైనల్‌లో స్థానం సంపాదించింది.

చిత్రం.. స్వీడన్‌తో జరిగిన మహిళల సెమీ ఫైనల్‌లో అనూహ్యంగా ఓడిన బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారిణుల దిగ్భ్రాంతి